/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/tolls-jpg.webp)
జాతీయ రహదారులను తరచుగా ఉపయోగించే మధ్య తరగతి మరియు ప్రైవేటు కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టోల్ గేట్లను అపరిమితంగా ఉపయోగించుకునేందుకు స్కీమ్ లను ప్రవేశపెట్టింది. జీవితకాలపు, ఏడాది టోల్ పాస్ లను ప్రవేశపెట్టింది. ఏడాది టోల్ పాల్ కోసం 3 వేలు రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. జీవిత కాలపు టోల్ పాస్ కోసం 30,000 రూపాయలు చెల్లించేలా కొత్త పాస్ లను తీసుకురానుంది. అయితే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ప్రతీ వాహనం యొక్క జీవిత కాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ జీవిత కాలపు పాస్ 15 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
Also Read: TS: షాద్ నగర్ ప్రైవేట్ పాఠశాలలో ఘోరం..విద్యార్థి ఆత్మహత్య
అదిరిపోయే ఆఫర్..
ప్రస్తుతానికి టోల్ గేట్ దగ్గర అమౌంట్ పే చేయడానికి కేవలం నెలకు మాత్రమే పాస్ లు తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రెస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందింస్తూ.. నెలకు రూ.340 చెల్లించాల్సి ఉండేది. అలాగే ఈ పాస్‌ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా రూ.4,080 చెల్లించాల్సి వచ్చేది. దీనిని మరింత డెవలప్ చేస్తూ..వాహనదారులకు సౌలభ్యం చేకూరేలా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఏడాదికి, జీవితకాలానికి పాస్ తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించనుంది. అది కూడా ఏడాదికి కేవలం రూ. 3 వేలకు మాత్రమే లభించేలా ప్లాన్ చేయనుంది. దీంతో వాహనదారుల టైమ్, మనీ రెండూ సేవ్ అవనున్నాయి.