/rtv/media/media_files/2026/06/01/annamalai-2026-06-01-18-08-44.jpg)
తమిళనాడు రాజకీయాల్లో అత్యంత పవర్‌ఫుల్ అండ్ క్రేజీ లీడర్‌గా ఎదిగిన మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అధికారికంగా అందజేశారని తెలుస్తోంది. గత ఆరేళ్లుగా ప్రజా జీవితంలో తనకు ఎన్నో అవకాశాలు, అనుభవాలు కల్పించినందుకు గాను పార్టీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పడానికే ఆయన ఢిల్లీ వెళ్తున్నారని, ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ భేటీ మాత్రమే కాదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
తమిళనాడు బీజేపీని నడిపించడానికి తనకు కనీసం ఏడేళ్ల పాటు పూర్తి స్వేచ్ఛ తిరుగులేని అధికారాన్ని ఇవ్వాలి.లేదా తన దారి తాను చూసుకునేందుకు అనుమతించాలి. అయితే అధిష్ఠానం నుండి ఆశించిన స్థాయిలో హామీ రాకపోవడంతోనే ఆయన పార్టీని వీడాలనే కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రూట్ మార్చాలని డిసైడ్
సీఎం విజయ్ రాకతో తన పొలిటికల్ రూట్ మార్చాలని అన్నామలై డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ, అన్నాామలై వాటిని ఎక్కడా ఖండించలేదు. కాగా, నివేదికల ప్రకారం.. ఆయన బీజేపీ జాతీయ నాయకత్వం ముందు రెండు ఆప్షన్లు పెట్టినట్లు సమాచారం.
ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై.. చాలా తక్కువ సమయంలోనే తన దూకుడు, ఆర్గనైజింగ్ స్కిల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. విమర్శకులు సైతం ఆయన ఎనర్జీని మెచ్చుకునేవారు. అయితే, ఆయన రాజకీయం ఎప్పుడూ బీజేపీ సాంప్రదాయ హిందుత్వ చట్రంలో ఇమడలేదు. అన్నాామలై తన ప్రసంగాల్లో మతపరమైన వ్యాఖ్యల కంటే తమిళ అస్తిత్వం, సుపరిపాలన, అవినీతి నిర్మూలన, అభివృద్ధి గురించే ఎక్కువగా మాట్లాడేవారు. చాలామంది విశ్లేషకులు దీనిని ఆస్పిరేషనల్ ద్రావిడ రాజకీయంగా అభివర్ణించేవారు. సిద్ధాంతాల కంటే కూడా రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడమే ఆయన లక్ష్యంగా ఉండేది.
Follow Us