/rtv/media/media_files/2025/03/01/A8Ql2aFYgMW6mUOJLhxb.jpg)
Amit Shah
మణిపూర్‌లో మెయిటీ, కూకీ జాతులు మధ్య నెలకొన్న వైరం రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇటీవలే బీజేపీ నేత బీరెన్ సింగ్ సీఎం పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. గత కొన్ని రోజులుగా అక్కడ రాష్ట్రపతి పాలనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా భద్రతా పరిస్థితులపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
మార్చి 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్కడ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడంపై ఢిల్లీలో అమిత్ షా అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మణిపుర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్మీ, పారామిలటరీ అధికారులు కూడా హాజరయ్యారు.
Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
ఇదిలాఉండగా గత రెండేళ్లుగా మణిపుర్‌లో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిని తట్టుకోలేక చివరికి ఇప్పటివరకు సీఎంగా ఉన్న బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై క్లారిటీ లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. అలాగే ప్రభుత్వ అధికారాలు గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఎవరివద్దైనా అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉంటే 7 రోజుల్లో అప్పగించాలని గవర్నర్ అజయ్ కుమార్ కూడా ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఏడు రోజుల్లోనే ప్రజలు దాదాపు 300 ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలుస్తోంది.