Air India : గంజాయితో పట్టుబడ్డ ఎయిర్ ఇండియా పైలట్..  ఏం చేశారంటే?

ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కో-పైలట్ అమెరికాలో గంజాయితో దొరికిపోవడం కలకలం రేపింది. ఏప్రిల్ 14న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన విమానంలో ఆయన విధుల్లో భాగంగా ప్రయాణించారు.

New Update
air india

ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కో-పైలట్ అమెరికాలో గంజాయితో దొరికిపోవడం కలకలం రేపింది. ఏప్రిల్ 14న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన విమానంలో ఆయన విధుల్లో భాగంగా ప్రయాణించారు. అయితే, విమానాశ్రయంలో అమెరికా అధికారులు తనిఖీలు చేయగా, ఆయన బ్యాగులో గంజాయి లభ్యమైంది. అక్కడి స్థానిక చట్టాల ప్రకారం ఇది నేరం కావడంతో, అధికారులు ఆయనను అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకుని, తిరిగి భారత్‌కు పంపించేశారు. 

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. తమ సిబ్బంది క్రమశిక్షణ విషయంలో జీరో టాలరెన్స్ (ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని) విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేసింది. సదరు పైలట్‌పై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, విచారణ కొనసాగుతోందని పేర్కొంది. ప్రయాణికుల భద్రత, నియమ నిబంధనల పాటించడమే తమకు అత్యంత ప్రాధాన్యత అని సంస్థ తెలిపింది.

వెస్ట్ జెట్ తో ఒప్పందం

మరోవైపు ప్రయాణికులకు శుభవార్త చెబుతూ ఎయిర్ ఇండియా కెనడాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వెస్ట్ జెట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల ప్రయాణికులు ఒకే టికెట్‌తో భారత్ నుంచి ఉత్తర అమెరికాలోని వివిధ నగరాలకు సులభంగా వెళ్లవచ్చు. టొరంటో, వ్యాంకూవర్ వంటి నగరాలకు వెళ్లిన తర్వాత, అక్కడి నుంచి కెనడాలోని 17 నగరాలకు, అమెరికాలోని 14 నగరాలకు వెస్ట్‌జెట్ విమానాల ద్వారా ప్రయాణించవచ్చు.
ప్రయాణికులు తమ సామాను విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రెండు సంస్థలు సమన్వయంతో దీనిని చూసుకుంటాయి.

Advertisment
తాజా కథనాలు