Air India Flight: సురక్షితంగా ల్యాండ్‌ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్

తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.

New Update

తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైడ్రాలిక్ సమస్య కారణంగా విమానం అలా కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. 

Also Read: ఏం గుండెరా నీది.. ఏకంగా మొసలితోనే..

ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని వెంటనే గమనించిన పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. ల్యాండ్ అయ్యేందుకు దాదాపు 3 గంటల పాటు ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అవుతుందా లేదా ప్రమాదం జరుగుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అప్పటికే రన్‌వే సమీపంలో అంబులెన్స్‌లు, ఫైర్‌ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు.  

అయితే అత్యవసర పరిస్థితుల్లో విమానం సురక్షితంగా ల్యాండ్ కావాలంటే అందులో ఉండే ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. అప్పుడే ఆ విమానాన్ని సేఫ్‌గా ల్యాండింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం 3 గంటల సేపు ఆ ఫ్లైట్‌ అలా గాల్లోనే తిరిగింది. ఎట్టకేలకు ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందులో ఉన్న 141 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు