BIG BREAKING: చక్రం తిప్పిన విజయ్.. 147కు చేరిన టీవీకే బలం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపు అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు ముందే సీఎం విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. ఏకంగా 28 మంది AIADMK రెబల్ ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు.

New Update
TVK Vijay

TVK Vijay

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపు అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు ముందే సీఎం విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. ఏకంగా 28 మంది AIADMK రెబల్ ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన బలం 147కు చేరుకుంది, ఇది మెజారిటీ మార్కును సులువుగా దాటేలా చేసింది.  దీంతో రేపటి ఫ్లోర్ టెస్ట్‌లో ఆయన గెలుపున దాదాపు ఖరారైపోయింది. 

ఇదిలాఉండగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్ల మేజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచింది. చివరికి కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న పార్టీల సపోర్ట్‌తో విజయ్ బలం 120కి చేరింది. మే 13న విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో 28 మంది AIADMK రెబల్ ఎమ్మెల్యేలు విజయ్‌కు సపోర్ట్‌ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisment
తాజా కథనాలు