రతన్ టాటా వారసుడు ఎవరు?.. రేసులో నలుగురు !

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంతో ఆయన వారసుడు ఎవరూ అన్న అంశం చర్చనీయాంశమవుతోంది. ఆయన వారసుల రేసులో నోయెల్, లేహ్ మాయా, నెవిల్లే.. ఈ నలుగురు ఉన్నారు. మరింత సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update

రతన్ టాటా తల్లిదండ్రుల పేర్లు నావల్ టాటా, సూనీ. వీరు 1940లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నావల్ టాటా 1955లో స్విస్ మహిళ సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నోయెల్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. నోయెల్ టాటాకు మాయ టాటా, నెవిల్లే టాటా, లియా టాటా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం టాటా గ్రూప్ వ్యాపారాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. వీరిలో రతన్ టాటా వారసులుగా ఎవరు ఉండబోతున్నారనే చర్చ జరుగుతుంది.

Also Read: రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్.. దేశం గురించి ఆయన ఏమన్నారంటే ?

లియో టాటా (39 సంవత్సరాలు).. స్పెయిన్ లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2006లో తాజ్ హోటల్స్ రిసార్ట్స్, ప్యాలెస్ లో పనిచేశారు. ఇప్పుడు ఇండియన్ హోటల్ కంపెనీ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఇక మాయ టాటా (34).. ఆమె ప్రస్తుతం టాటా ఫైనాన్షియల్ సంస్థలో విశ్లేషకురాలిగా పనిచేస్తున్నారు. ఆపర్చునిటీస్ ఫండ్, టాటా డిజిటల్‌లో కీలక బాధ్యతల్లో ఉన్నారు.

నెవిల్లే టాటా (32).. రతన్ టాటా సామ్రాజ్యానికి వారసుడిగా కూడా ఇతన్ని చూస్తున్నారు. అతను టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కిర్లోస్కర్ ను వివాహం చేసుకున్నారు. జంషెడ్ టాటా అనే కుమారుడు ఉన్నాడు. ట్రెంట్ లిమిటెండ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్‌కు నెవిల్లే నాయకత్వం వహిస్తున్నాడు. ఇదిలాఉండగా.. టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ మొత్తం రూ.30 లక్షల కోట్ల వరకు ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు