Adobe: విద్యార్థులకు అడోబ్‌ గుడ్‌న్యూస్‌.. ఈ సాఫ్ట్‌వేర్స్‌ ఉచితం

ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు అడోబ్ శుభవార్త తెలిపింది. ఏఐ ఆధారిత క్రియేటివ్, ప్రొడక్టివిటీ టూల్స్‌ను ఫ్రీగా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026లో ఈ ప్రకటన చేసింది.

New Update
Adobe offers Photoshop, Acrobat and Firefly AI free of cost to these students in India

Adobe offers Photoshop, Acrobat and Firefly AI free of cost to these students in India

ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు అడోబ్ శుభవార్త తెలిపింది. ఏఐ ఆధారిత క్రియేటివ్, ప్రొడక్టివిటీ టూల్స్‌ను ఫ్రీగా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026లో ఈ ప్రకటన చేసింది. తమ సంస్థ అందించే ఆఫర్‌లో అడోబ్ ఫోటోషాప్, అక్రోబాట్, అడోబ్ ఫైర్‌ఫ్లై టూల్స్‌ను దేశంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫ్రీగా అందిస్తామని స్పష్టం చేసింది. 

Also Read: గల్గోటియాస్ రోబోట్ వివాదం.. నేహా సింగ్ Open To Work పోస్ట్ వైరల్!

అంతేకాదు సాఫ్ట్‌వేర్‌ యాక్సెస్‌తో పాటు.. ఈ టూల్స్‌ వినియోగించడంపై ట్రైనింగ్, కరిక్యులమ్, సర్టిఫికేషన్‌ కూడా ఇవ్వనుంది. కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఉన్న 15 వేల పాఠశాలలు, 500 కళాశాలల్లో ఉన్న స్టూడెంట్స్‌కు ఈ సౌకర్యం లభించనుంది. అలాగే నాస్కామ్‌తో కలిసి ఏఐ ఫస్ట్‌ లెర్నింగ్‌ కోర్సులు, సర్టిఫికేషన్లను కూడా అడోబ్ అందించనుంది. 

Also Read: ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం.. బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్టు..

ఇది తమ వ్యూహాత్మక పెట్టుబడి అని అడోబ్ పేర్కొంది. భారత్‌లో లక్షలాది మంది స్టూడెంట్స్‌కు సృజనాత్మకతను పెంచడం కోసం తమవంతు కృషి చేస్తున్నామని అడోబ్‌ తెలిపింది. ఏఐ స్కిల్స్‌ను పొందడంలో తాము సహకరిస్తామని పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు