/rtv/media/media_files/2025/04/05/SyBV5JSmsWe4ZBS1RQ3T.jpg)
Actor Darshan Arrested
ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్‌కు అన్ని భాషల్లోనూ మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఈ షో ద్వారా పాపులర్ అయి.. సినిమాల్లో రాణిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ షోతో క్రేజ్ సంపాదించుకున్న చాలా మంది వివిధ రంగాల్లో బాగా సెటిల్ అయ్యారు. అందులో బిగ్ బాస్ ఫేం దర్శన్ ఒకరు.
Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్
తాజాగా నటుడు & బిగ్ బాస్ ఫేం దర్శన్ చిక్కుల్లో పడ్డాడు. అతడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఒక కారు పార్కింగ్ వ్యవహారంలో తలెత్తిన వివాదంలో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఆ కారు పార్కింగ్ వివాదంలో న్యాయమూర్తి కుమారుడిపై దాడి చేయడంతో దర్శన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఏం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీలంకకు చెందిన నటుడు దర్శన్.. తమిళంలోని విజయ్ టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-3 ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ‘గూగుల్ కుట్టప్ప’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దర్శన్ ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. అతడు చెన్నైలోని ముగప్పేర్‌లో ఉంటున్నాడు. అక్కడే దర్శన్ ఇంటిముందు ఒక టీ షాప్ ఉంది.
Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
ఆ షాప్‌కు వచ్చిన వారంతా దర్శన్ ఇంటి ముందే వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆ షాప్‌కు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు ఆత్తిచుడి.. దర్శన్ ఇంటి ముందు కారు పార్కింగ్ చేశారు. దీంతో అది చూసిన దర్శన్ అక్కడికి వచ్చి కారు తీయమని చెప్పాడు. ఈ క్రమంలో కారు పార్కింగ్ చేసిన వ్యక్తికి, దర్శన్‌కి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త కొట్టుకునేంతవరకు వెళ్లింది.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
ఈ దాడిలో కారు పార్క్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు ఆత్తిచుడి, అతని అత్త మహేశ్వరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ గాయాలతో వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జేజే నగర్ పొలీసులు దర్యాప్తు చేసి నటుడు & బిగ్ బాస్ ఫేం దర్శన్ సహా అతడి సోదరుడు లోకేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే దర్శన్ ఫిర్యాదు మేరకు న్యాయమూర్తి కుమారుడు ఆత్తిచుడి, ఆయన భార్య, అత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(bigg-boss | latest-telugu-news | telugu-news | actor-darshan-arrest)