Maharashtra : ఘోర ప్రమాదం: బావిలో పడ్డ భక్తుల వాహనం.. ఎనిమిది మంది మృతి!

మహారాష్ట్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

New Update
maharashtra

మహారాష్ట్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ప్రసిద్ధ సిద్ధనాథ్ ఆలయాన్ని దర్శించుకుని, అక్కడ ప్రత్యేక పూజలు ముగించుకున్న తర్వాత తిరిగి రంజని గ్రామానికి ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యంలో ఒక్కసారిగా వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ పికప్ వ్యాన్ వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద బావిలోకి పడిపోయింది.

ఏడుగురిని ప్రాణాలతో కాపాడి

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్‌లు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బావిలో పడిపోయిన వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదం నుండి ఏడుగురిని ప్రాణాలతో కాపాడి, చికిత్స నిమిత్తం వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగే సమయంలో వాహనం వేగంగా ఉండి రోడ్డు పక్కకు దూసుకెళ్లిందా, లేదా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడా అనే కోణంలో స్థానిక యంత్రాంగం విచారణ జరుపుతోంది. ఈ ఘటనతో రంజని గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisment
తాజా కథనాలు