/rtv/media/media_files/2025/03/30/dZcWZDRVtSWdPCTsMSCZ.jpg)
amit-shah, Naxalites
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు కొన్ని గంటల ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో యాభై మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ యాభై మంది నక్సలైట్లలో 14 మందిపై రూ. 68 లక్షల రివార్డు ఉంది. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ, "ఆయుధాలు వదిలి అభివృద్ధి మార్గాన్ని అవలంబించే ఏ నక్సలైట్ అయినా పునరావాసం పొంది ప్రధాన స్రవంతిలోకి అనుసంధానించబడతారని మోడీ జీ విధానం స్పష్టంగా ఉంది" అని అమిత్ షా అన్నారు. మిగిలిన వారు ఆయుధాలు వదులుకోవాలని, ప్రధాన స్రవంతిలో చేరాలని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి 31, 2026 తర్వాత, దేశంలో నక్సలిజం చరిత్రగా మారుతుంది, ఇది మా సంకల్పం అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఇప్పటికే ఎన్ కౌంటర్లలో తమ క్యాడర్ ను కోల్పోతున్న మావోయిస్టులకు ఇది నిజంగా పెద్ద షాకనే చెప్పాలి. కాగా మార్చి 29న, దంతెవాడ జిల్లాలో 15 మంది మావోయిస్టులు లొంగిపోగా.. గతేడాది ఆగస్టులో 25 మంది నక్సలైట్లు లొంగిపోయారు.
बहुत हर्ष का विषय है कि बीजापुर (छत्तीसगढ़) में 50 नक्सलियों ने हिंसा का रास्ता छोड़कर आत्मसमर्पण किया। हिंसा और हथियार छोड़कर विकास की मुख्यधारा में शामिल होने वालों का मैं स्वागत करता हूँ। मोदी जी की नीति स्पष्ट है कि जो भी नक्सली हथियार छोड़कर विकास का मार्ग अपनाएँगे, उनका…
— Amit Shah (@AmitShah) March 30, 2025
కాంగ్రెస్ విధానాల వల్లే నక్సలిజం ప్రోత్సాహం పొందింది: మోదీ
కాంగ్రెస్ విధానాల వల్లే ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాల్లో దశాబ్దాలుగా నక్సలిజం ప్రోత్సహించబడిందని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బిలాస్‌పూర్ జిల్లాలోని మోహభట్టా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ, పరిస్థితి వేగంగా మారుతోందని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతియుత నూతన యుగం ప్రారంభమవుతోందని అన్నారు. దశాబ్దాలుగా, కాంగ్రెస్ విధానాల కారణంగా ఛత్తీస్‌గఢ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో నక్సలిజం ప్రోత్సాహాన్ని పొందింది. అభివృద్ధిలో ఏ ప్రాంతం వెనుకబడిందో, అక్కడ నక్సలిజం వృద్ధి చెందింది, కానీ 60 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ ఏమి చేసింది? అటువంటి జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి, దాని బాధ్యత నుండి తప్పుకుందని ఆయన విమర్శించారు.
Also read : Aarogyasri card : ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? అయితే ఈ శుభవార్త మీ కోసమే