కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. బుధవారం అర్ధరాత్రి 1:00 నుంచి 2:00 గంటల మధ్య ఈ తొక్కిసలాట చోటుచేసుకున్న మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో ఇప్పటివరకు 25 మందిని గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Prayagraj, UP: 30 people have lost their lives in the Maha Kumbh stampede that took place between 1-2 AM. 25 people have been identified and the identification of the remaining 5 is being done: DIG Mahakumbh, Vaibhav Krishna pic.twitter.com/9CqHORT0wt
— ANI (@ANI) January 29, 2025
ఇదిలాఉండగా.. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా భారీ భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ సెక్టార్ -2 వద్దకు వచ్చారు. అమృత స్నానాల కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తోపులాట జరగగా బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. అయితే తాజాగా డీఐజీ 30 మంది మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనలో మరో 70 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: సౌదీ అరేబియాలో 9 మంది భారతీయులు మృతి
మౌని అమవాస్య నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వస్తారని అర్ధరాత్రి 12 గంటలకే డీఐజీ వైభవ్ కృష్ణ అక్కడ అందిరినీ అలర్ట్ చేశారు. ఆ సమయంలో భక్తులు త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని సూచనలు చేశారు. అలాగే ఘాట్ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని కూడా హెచ్చరించారు. కానీ అప్పటికే భారీగా తరలివచ్చిన భక్తులు పోలీసుల మాటలు వినలేదు. రద్దీ కూడా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.