సైబర్ స్కామ్.. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళ బట్టలు విప్పించి..!

అహ్మదాబాద్‌‌కు చెందిన 27ఏళ్ల హేమాలి పాండ్యకు ఢిల్లీ సైబర్ క్రైమ్ ఆఫీసర్‌గా కాల్ వచ్చింది. మత్తు పదార్థాల స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులు అంటూ బెదిరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒంటిపై పుట్టుమచ్చలు చూపించమని డిమాండ్ చేశారు. ఆపై రూ.5 లక్షలు కొట్టేశారు.

New Update
cyber scam

రోజు రోజుకూ సైబర్ స్కామర్లు రెచ్చిపోతున్నారు. సంపన్నులే లక్ష్యంగా చేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం డబ్బులు దోచేస్తున్నారు. ఈ మధ్య ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ ఆన్‌లైన్‌లో వాట్సాప్ కాల్ ద్వారా కళ్లముందే డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరోకటి జరిగింది. ఓ 27 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. సెంట్రల్ ఏజెన్సీలకు చెందిన అధికారులమంటూ సైబర్ కేటుగాళ్లు రూ.5 లక్షలు స్వాహా చేశారు. అక్కడితో ఆగకుండా ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో విచారణలో భాగంమంటూ ఆమె బట్టలు విప్పమని బలవంతం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయానికొస్తే.. 

ఇది కూడా చదవండి: వివో నుంచి కిక్కిచ్చే కొత్త ఫోన్.. ఫీచర్లు మామూలుగా లేవు !

అహ్మదాబాద్‌ నారన్‌పురాలోని 132 ఫీట్ రింగ్ రోడ్‌లోని సమర్పన్ టవర్‌లో నివసిస్తున్న 27 ఏళ్ల హేమాలి పాండ్య అనే మహిళకు అక్టోబరు 13న ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను కొరియర్ కంపెనీ ఉద్యోగినంటూ తెలిపాడు. ఆపై మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్‌ఫోన్‌లు, 150 గ్రాముల మెఫెడ్రోన్, 1.5 కిలోల క్లాత్‌లు ఆమె పేరుతో ఉన్న పార్శిల్‌ను థాయ్‌లాండ్‌కు పంపినట్లు ఆ వ్యక్తి మాట్లాడాడు. అందువల్ల కఠినమైన నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించారు. వెంటనే సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించాలని తెలిపాడు. 

ఇది కూడా చదవండి:  ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

వాట్సాప్‌కు నకిలీ నోటీసులు

దీంతో పాండ్య భయబ్రాంతులకు గురైంది. దీంతో వెంటనే ఆమెకు ఢిల్లీ సైబర్ క్రైమ్ ఆఫీసర్‌గా మరో వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. మాదక ద్రవ్యాల విచారణలో ఆమె పేరు బయటపడిందని ఆమెను ఇంకాస్త బెదిరించాడు. వెంటనే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని పట్టుబట్టాడు. ఆమెను ఇంకాస్త బయపెట్టేందుకు పాండ్యా వాట్సాప్‌కు నకిలీ నోటీసులు పంపించారు. 

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్‌ ఫేమ్, ఆర్జే శేఖర్‌ బాషా అరెస్ట్‌

శరీరంపై పుట్టుమచ్చలు చూపించు

తనపై మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మనీలాండరింగ్ వంటి కేసులు పెట్టినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఇదంతా నిజమేనని పాండ్యా మోసపోయింది. ఆపై మరో వ్యక్తి తన ముఖాన్ని దాచిపెట్టి సీబీఐ అధికారిగా కాల్‌లోకి వచ్చాడు. ‘డిజిటల్ అరెస్టు’ అంటూ.. ఆమె శరీరంపై పుట్టుమచ్చలను చూపించమన్నాడు. తద్వారా ఆమె గుర్తింపును నిరూపించుకోవడానికి ఆమె బట్టలు విప్పమని డిమాండ్ చేశాడు. అయితే మొదట్లో సంకోచించిన పాండ్యా.. జైలు బెదిరింపులతో భయపడిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియక వారు చెప్పింది చేసింది.

ఇది కూడా చదవండి: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

వివిధ ఖాతాలకు రూ.5 లక్షలు ట్రాన్సఫర్

ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ.5 లక్షలు ట్రాన్సఫర్ చేయమని కొన్ని అకౌంట్ నెంబర్లు పంపించారు. దీంతో ఆమె వెంటనే వివిధ ఖాతాలకు ఆ డబ్బును పంపించింది. ఆపై నేరస్థులు వెంటనే కాల్ కట్ చేసి తమ ఫోన్ నెంబర్‌లను డియాక్టివేట్ చేసేశారు. మోసపోయానని భావించిన పాండ్యా వెంటనే నారన్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోర్జరీ, వంచన, చీటింగ్, దోపిడీ, నేరపూరిత కుట్రతో సహా వివిధ సెక్షన్ల కింద గుర్తుతెలియని నేరస్థులపై కేసులు నమోదు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు