BIG BREAKING :  కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 20 మంది విద్యార్థులకు గాయాలు!

తమిళనాడులోని కరూర్ జిల్లాలో  భయంకరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఒక ప్రైవేట్ కాలేజీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

తమిళనాడులోని కరూర్ జిల్లాలో  భయంకరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఒక ప్రైవేట్ కాలేజీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెల్లియానై సమీపంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

అకస్మాత్తుగా పట్టాలపైనే

 ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సు రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా పట్టాలపైనే నిలిచిపోయింది. అదే సమయంలో ఒక ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి కంకర రాళ్లను తరలిస్తున్న గూడ్స్ రైలు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది. లోపల ఉన్న విద్యార్థులు హాహాకారాలు చేస్తూ కిందపడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన విద్యార్థులందరినీ వెంటనే కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ట్రాక్‌పై ఎందుకు ఆగిపోయింది? అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ లేదా గేట్ ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు