TMC రెండు ముక్కలు...మమత మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్  ఘోరంగా ఓటమి పాలైంది. బీజేపీ అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఓటమితో చతికలపడ్డ తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఫిరాయింపుల టెన్షన్‌ పట్టుకుంది.

New Update
mamata tmc

TMC

TMC: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్  ఘోరంగా ఓటమి పాలైంది. బీజేపీ అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఓటమితో చతికలపడ్డ తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఫిరాయింపుల టెన్షన్‌ పట్టుకుంది. అనూహ్య ఓటమి తర్వాత పార్టీ అధినేత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన కీలక వ్యూహరచన సమావేశానికి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 70 మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.  దీంతో పార్టీలో చీలిక వస్తుందా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ చేతిలో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లోతైన సంక్షోభంలో కూరుకుపోయిందనే అనుమానాలను రేకెత్తిస్తోంది.

పార్టీ వర్గాలు వివరణ

అయితే ఎమ్మెల్యేల గైర్హాజరుపై పార్టీ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఎమ్మెల్యేలంతా ముందుగానే అనుమతి తీసుకున్నారని,  పార్టీయే వారిని రావద్దని కోరిందని స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఉత్తర బెంగాల్ ఎమ్మెల్యేలను రావద్దని చెప్పామని, సాగర్‌దిఘి ఎమ్మెల్యే కుటుంబ అత్యవసర పరిస్థితి వల్ల రాలేకపోయారని, బీర్భూమ్ ఎమ్మెల్యే కాజల్ ఎస్కే ఎన్నికల అనంతర హింస బాధితులకు సహాయం చేసేందుకు అక్కడే ఉన్నారని వివరించారు.

Also Read: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!

కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ, బాధ్యతల కేటాయింపుపై దీదీ తీసుకునే నిర్ణయమే అంతిమమని, అందరూ దానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీ విజయం సరైనది కాదని, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. 

Also Read: TMC రెండు ముక్కలు...మమత మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా!

అయితే నాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టినప్పటికీ, ఫలితాలు వచ్చిన 48 గంటల్లోనే అసమ్మతి బహిరంగంగా బయటపడింది. మాజీ మంత్రి, క్రికెటర్ మనోజ్ తివారీ మాజీ సీనియర్ మంత్రి అరూప్ బిస్వాస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేసిందని, అందుకే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. హౌరాలో తాను ప్రతిపాదించిన స్పోర్ట్స్ హబ్ ప్రాజెక్టును ఇన్సెక్యూరిటీ వల్ల అడ్డుకున్నారని, మంత్రిత్వ శాఖలో తనను పదేపదే అవమానించారని ఆయన ఆరోపించారు. చివరికి ముఖ్యమంత్రికి తన బాధలు చెప్పుకుందామన్నా ఆమె సమయం ఇవ్వలేదని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: విజయ్ నీకు ఆరు నెలలు టైమ్ ఇస్తాం.. స్టాలిన్ సంచలన కామెంట్స్!

అసమ్మతి కేవలం అక్కడితోనే ఆగలేదు. పార్టీ ప్రతినిధి రిజు దత్తా మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత తన ఇంటిపై దాడి జరిగితే సొంత పార్టీ నేతలు పట్టించుకోలేదని, ఆ సమయంలో బీజేపీ నేతలే తనకు సాయం చేశారని బాంబు పేల్చారు. అటు ఎంపీ దేవ్ కూడా బీజేపీకి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఇక పార్టీ ఓటమికి అభిషేక్ బెనర్జీ పనితీరు కారణమని మరికొందరు సీనియర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇలా నేతలంతా రచ్చకెక్కుతుండటంతో టీఎంసీ అలర్ట్ అయింది. ఇవన్నీ వారి వ్యక్తిగత మాటలని, పార్టీకి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది. ఏది ఏమైనా, ఓటమి దెబ్బతో తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు అతి పెద్ద సంక్షోభంలో పడిందనేది వాస్తవం.

Advertisment
తాజా కథనాలు