బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి

మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన కొహ్మారా స్టేట్ హైవేపై చోటు చేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

New Update
bus overturns

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోండియా జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 10 మందికి పైగా మృతి చెందారు. కొహ్మారా స్టేట్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. 

Also Read: పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్

బైకును తప్పించబోయి బస్సు బోల్తా

నాగ్‌పూర్ నుంచి గోండియా వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వచ్చిన బైకును తప్పించబోయి బోల్తాపడింది. అయితే ఘటనా సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అయితే అందులో 10 మందికి పైగా మృతి చెందగా.. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా?

ఇలాంటిదే మరో ప్రమాదం

బీహార్‌లోని అర్వార్ జిల్లాలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మహీంద్రా స్కార్పియోలో వెళ్తుండగా.. మార్గ మధ్యలో వాహనం ఓ చిన్న స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వెహికల్ స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న కెనాలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మరణించారు. ముగ్గురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్‌

ఏపీలో మరో ఘటన

ఇటీవల ఏపీలోని కర్నూలులో ఓ వివాహ వేడుకలో విషాద ఘటన జరిగింది. కోసిగి మండలంలోని సజ్జలగుడ్డం గ్రామంలో పెళ్లయిన తర్వాత ఉరేగింపు నిర్వహిస్తుండగా డీజే వాహనం కింద పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. 

Also Read: భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్

సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన ఆర్లబండ నాగేష్ కొడుకు బసవరాజుకి బుధవారం ఉదయం వివాహం జరిగింది. ఈ క్రమంలో ఆ రోజు రాత్రి గ్రామంలో ఉరేగింపు నిర్వహించారు. డీజే వాహనం అదుపుతప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఏడేళ్ల బాలుడు చనిపోయాడు. వెనుక వైపు నుంచి బాలుడి తలభాగంపైకి వాహనం వెళ్లింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు చావును తట్టుకోలేక కుటుంబ సభ్యులు పెళ్లి వాహనాలను ధ్వంసం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు