BIG BREAKING: దారుణం.. 9 మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. 

New Update
Jawans

Jawans

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాల వాహనాన్ని మందుపాతరతో పేల్చారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అదనపు బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరించారు. జవాన్లు కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ పేలుడు జరిగింది. కుత్రు-బద్రే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఈ దాడులకు తెగబడ్డారు. 

Also Read: ఆర్మీ కాన్వాయ్‌ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి

ఇదిలాఉండగా.. గత కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్, సుకుమా జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా 9 మంది జవాన్లు మృతి చెందడం కలకలం రేపుతోంది.  

Also Read: భయపెడుతున్న HMPV.. భారత్‌లో మొత్తం 3 కేసులు

ఇదిలాఉండగా ఈ మధ్య దండకారణ్యంలో మావోయిస్టులు (నక్సలైట్లు) పిట్టల్లా రాలిపోతున్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గత పదేళ్లుగా నక్సల్స్‌ను లేకుండా చేయాలని కేంద్రం ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. ముఖ్యంగా మావోయిస్టుల కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో మావోలతో పాటు.. పలువురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.        

ALso Read: పెరిగిన చలి.. రానున్న ఐదు రోజులు మరింత తీవ్రం అంటున్న అధికారులు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment