ఐఫోన్‌ కోసం కన్న కొడుకుని అమ్మేసిన తల్లిదండ్రులు, కానీ చివరికి..

ఇటీవల చాలామంది ఫోనుతోనే కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తలదూర్చిన కొంతమంది మాత్రం పక్కన పెద్ద పిడుగుపడినా పట్టించుకోరు వీళ్లు. అంతలా ఫోన్లకు కనెక్ట్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామందికి చాలా క్రేజ్ వస్తోంది. దీనికి చదువు, అనుభవం పెద్దగా అక్కర్లేదు. కేవలం టాలెంట్ ఉంటే చాలు. కానీ ఇక్కడ ఐఫోన్‌ కోసం ఎవరు చేయని దారుణానికి తల్లిదండ్రులు ఒడిగట్టారు.ఏకంగా కన్న కొడుకునే అమ్ముకున్నారు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది.

New Update
ఐఫోన్‌ కోసం కన్న కొడుకుని అమ్మేసిన తల్లిదండ్రులు, కానీ చివరికి..

ఓవర్ నైట్ స్టార్స్ అయిపోదామని సోషల్ మీడియా మీద మోజుతో ఓ తల్లిదండ్రులు చేసిన పని దేశం మొత్తం నివ్వెరపోయేలా చేసింది.ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే ఇన్‌స్టా‌గ్రామ్‪లో రీల్స్ చేయడం కోసం ఐఫోన్ కొనాలనుకున్నారు. దీనికోసం కన్న కొడుకునే అమ్మేశారు ఈ కసాయి తల్లిదండ్రులు. అమ్మతనానికే మచ్చతెచ్చిన సంఘటన పశ్చిమ బెంగాల్‌ ఉత్తర 24 పరగణాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సతి దంపతులకు ఇద్దరు పిల్లలు.

 

ఏడేళ్ల కుమార్తెతో పాటు వారికి 8 నెలల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని రోజులుగా పిల్లవాడు కనిపించకపోవడంతో స్థానికంగా నివాసం ఉండే చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి తల్లిదండ్రులను నిలదీశారు. దీంతో వీరి బాగోతం కాస్త బట్టబయలైంది.అలాగే ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న దంపతుల చేతిలో ఒక్కసారిగా ఐఫోన్ కనిపించడం, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో అనుమానం వచ్చి వారిని నిలదీయడం మొదలు పెట్టారు. దీంతో తమ కుమారుడిని అమ్మేసి ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు.

national-news-parents-sold-own-child-for-i-phone-in-west-bengal-state-viral-news1

ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.తల్లిని అదుపులోకి తీసుకోగా తండ్రి జయదేవ్ పరారీలో ఉన్నాడు. బిడ్డను కొనుగోలు చేసిన మహిళను ప్రియాంగ ఘోష్‌గా గుర్తించి పట్టుకున్నారు. ఇందులో మరో విషయమేమింటంటే తన ఏడేళ్ల కుమార్తెను కూడా అమ్మేయాలని అనుకున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కడుపున పుట్టిన బిడ్డను అమ్ముకోవడం పట్ల ఈ దంపతులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

national-news-parents-sold-own-child-for-i-phone-in-west-bengal-state-viral-news2

డబ్బులు కష్టపడి ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ కడుపు పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను అమ్ముకోవడం ఏంటని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీరిని చూసి సమాజం చాలా చెడిపోతుందని వీరిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని అభం శుభం తెలియని పిల్లలను అమ్ముకోవడం ఏంటంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది ఘాటుగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా చిన్నచిన్న విషయాలకు కష్టం చేసి సంపాదించుకోవాలే తప్పా కన్నపిల్లలను అమ్ముకోకూడదంటూ సలహాలు ఇస్తున్నారు. మీకు పనికావాలంటే చెప్పడంటూ దేశమంతటా నెటిజన్లందరూ తమదైనా శైలీలో చురకలు అంటిస్తున్నారు. మీకు పనిచేయడం చాతకాకపోతే పిల్లలని కనడం ఎందుకంటూ నిలదీశారు. పని చేయడం చాతకాకపోతే అడుక్కోనైనా సరే పిల్లలను పోశించాలంటూ కామెంట్స్ రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు