Republic Day 2024: ఆ గ్రామాల్లో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అనే ప్రాంతంలో 9 మారుమూల్లో తీవ్రవాదం ప్రభావం కారణంగా 1947 నుంచి ఇంతవరకు ఒక్కసారిగా కూడా జాతీయ జెండా రెపరెపలాడలేదు. ఇప్పుడు తీవ్రవాద ప్రమాదం తగ్గిన నేపథ్యంలో మొదటిసారిగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది.

New Update
Republic Day 2024: ఆ గ్రామాల్లో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య లేదా గణతంత్ర దినోత్సవాలు జరుపుకునేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క గ్రామాల్లో జాతీయ జెండా రెపరెపలాడుతుంది. ఆ రోజంతా అదొక వేడుకలాగా జరుగుతుంది. ముఖ్యంగా పాఠశాలల్లో వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ మనదేశంలోని ఓ తొమ్మిది గ్రామాల్లో మాత్రం ఇప్పటివరకు త్రివర్ణ పతాకం ఎగరవేయలేదు. అదేంటి.. స్వాతంత్ర్య లేదా గణతంత్ర దినోత్సవం అప్పుడు ప్రతి ఊరిలో జాతీయ జెండా ఎగరవేస్తారుగా.. మరి ఈ 9 గ్రామాల్లో ఇంతవరకు ఎందుకు ఎగరవేయలేదు అని అనుకుంటున్నారా ?. దానికి కూడా కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదు: గవర్నర్ తమిళిసై

తీవ్రవాదుల ప్రభావం

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అనే ప్రాంతంలో 9 మారుమూల గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోనే శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలాడనుంది. 76 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక చారిత్రక ఘటన అనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి బస్తార్‌ ప్రాంతంలో తీవ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండేంది. అందుకే మనకు స్వాతంత్ర్యం వచ్చినా కూడా భద్రతా కారణాల దృష్ట్యా 1947 నుంచి అక్కడ జెండా ఎగురవేయలేదు.

తొలిసారిగా రెపరెపలాడుతున్న జెండా

ప్రస్తుతం అక్కడ తీవ్రవాదుల ప్రభావం తగ్గడంతో మొదటిసారిగా 2023 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. ఇప్పుడు తొలిసారిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భద్రతాదళాలతో ఈ గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త శిబిరాలు గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేశాయి. ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతం ఛత్తీస్‌గడ్‌లో వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉంది. గతంలో అక్కడ చాలాసార్లు నక్సలైట్ల దాడులు జరిగాయి. అయితే ఈ ప్రాంతంలో మొదటిసారిగా జెండా ఎగురవేయడంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పాకిస్తానీలను చంపింది భారత ఏజంట్లే..భారత్‌ పై పాక్‌ సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు