Chain Snatching: రైలులో చైన్ స్నాచింగ్..దొంగకు ఊహించని షాక్ రైళ్లలో చోరీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారులు సైతం జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులను హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు మహిళలు రైలులో వాష్‌రూమ్ కోసం వెళ్లారు. డోరు దగ్గర నిలుచుని ఉన్న దొంగ మహిళపై దాడి చేసి ఒక్కసారిగా మెడలోని గొలుసును లాగేశాడు. తర్వాత రైలులోంచి దూకేశాడు. By Vijaya Nimma 29 Mar 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Chain Snatching: రైళ్లలో చోరీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారులు సైతం జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులను హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ దొంగకు సంబంధించిన వీడియో ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. రైలులో మహిళ చైన్ కొట్టేసిన దొంగకు ఊహించని షాక్ తగిలింది. ఇద్దరు మహిళలు రైలులో వాష్‌రూమ్ కోసం వెళ్లారు. డోరు దగ్గర నిలుచుని ఉన్న ఓ దొంగ ఓ మహిళపై దాడి చేసి ఒక్కసారిగా మెడలోని గొలుసును లాగేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. హఠాత్తుగా రైలులోంచి దూకేశాడు. అయితే ఆ సమయానికి రైలు వేగంగా ఉన్న విషయం అతను గమనించలేదు. వెంటనే పట్టాలపై పడిపోయాడు. *While traveling in a train be careful* pic.twitter.com/6EDtRiEhXS — Narayanan R (@rnsaai) March 26, 2024 ఇదంతా బోగీలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే దొంగ ఉద్దేశపూర్వకంగానే బోగీ డోర్ తెరిచి దొంగతనం చేశాడని, కాకపోతే రైలు వేగాన్ని అంచనా వేయలేకపోయాడని పోలీసులు అంటున్నారు. ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 2 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇది చూసిన నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారి చూస్తున్నానని ఓ నెటిజెన్ కామెంట్ చేయగా..ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకోవాలంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే దొంగ పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మాత్రం మిస్టరీగా మారింది. ఇది కూడా చదవండి: ధూమపానం మానేయడం ఎలా? ఈ చిట్కాలు ట్రై చేయండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #train #chain-snatching మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి