Science:అరుదైన మిల్కీ వే గెలాక్సీ ఫోటో తీసిన జేమ్స్ వెబ్ టెలీస్కోప్ మిల్కీ వే గెలాక్సీ ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అరుదైన ఫోటో తీసింది. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా వారిలో కొత్త చర్చకు దారి తీసింది. దీని ద్వారా కొత్త అధ్యయనాలు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By Manogna alamuru 21 Nov 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అత్యతం అరుదైన ఫోటోలను తీస్తోంది. శాస్త్రవేత్తల ఊహలకు మాత్రమే పరిమితమవుతున్న ఎన్నో అద్భుతాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. తాజాగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఒక ఫోటో శాస్త్రవేత్తలను మెస్మరైజ్ చేస్తోంది. మిల్కీ వే గెలాక్సీ హార్టను ఫోటో తీసింది. ఈ మిల్కీ వే గెలాక్సీలోనే మన సూర్యుడుకూడా ఉంటాడు. సజుతేరిస్ సీగా సైంటిస్టులు పేరుపెట్టిన ఈ ప్రాంతంలో దాదాపుగా 5లక్షల నక్షత్రాలు ఉంటాయి. వాటిలో చాలా వరకూ సూర్యుడి కంటే 30రెట్లు పెద్దగా ఉంటాయి. కానీ అవన్నీ పూర్తి నక్షత్రాలుగా మారలేదు. వీటిని ప్రోటోస్టార్స్ అంటారు. ఇప్పుడిప్పుడే ఇవి నక్షత్రాలుగా మారుతున్నాయి. భూమి నుంచి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే మిల్కీ వే గెలాక్సీ కి ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ కి అతిదగ్గరగా ఉంటుంది జేమ్స్ వెబ్ టెలీస్కోప్ తీసిన ఫోటోలో ఉన్న ప్రాంతం. Also Read:మైక్రోసాఫ్ట్ లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో సామ్ ఆల్టన్.. ఇంతకు ముందే సైంటిస్టులు ఈ ప్రాంతాన్ని గుర్తించారు. కానీ అంతా ఊహల్లో, లెక్కలో మాత్రమే. ఇప్పుడు దాన్నే నాసా జేమ్స్ వెబ్ కి నిర్ క్యామ్ తొలిసారిగా ఫోటోలు తీసింది. ఈ హై రిజల్యుషన్ ఫోటోలు, సెన్సిటివిటీ ఫోటోల సహాయంతో అక్కడి ఇన్ ఫ్రారెడ్ డేటాను అధ్యయనం చేయొచ్చని, గెలాక్సీ మీద ఒక అంచనాకు రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గెలాక్టిక్ సెంటర్ గా పిలుచుకునే ఈ ప్రాంతం నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయో పరిశీలించేందుకు చాలా అనువైనది. Also Read:తెలంగాణలో 49 కేంద్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు View this post on Instagram A post shared by NASA (@nasa) #nasa #galaxy #milky-way #james-web-telescope మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి