Nara Lokesh: బ్యాచ్ నెంబర్ 420 జగ్గడు.. జగన్ పై లోకేష్ సెటైర్లు! సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు టీడీపీ నేత నారా లోకేష్. ప్రతి దొంగపనికి సుద్దులు చెప్పే వాడే చంచల్ గూడ స్కూలు, స్టూడెంట్ నెంబర్ 6093, బ్యాచ్ నెంబర్ 420 జగ్గడు అని విమర్శించారు. By V.J Reddy 18 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి AP Politics: ఏపీలో రాజకీయాలు నేతల మధ్య మాటల యుద్ధంతో హోరెత్తిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు మధ్య తిట్ల దండకం తార స్థాయికి చేరుకుంది. తాజాగా సీఎం జగన్ (CM Jagan) పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ (Nara Lokesh). పొదుపు అంటే ధరలు పెంచడం కాదు అంటూ విమర్శలు చేశారు. ALSO READ: కేసీఆర్ ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయాడు.. అమిత్ షా సంచలన ఆరోపణలు లోకేష్ ట్విట్టర్ లో.. 'విద్యుత్ పొదుపు చేయాలంటే కరెంటు ఛార్జీలు పెంచేయడం, మద్యం నిషేధించకుండానే తాగుడు మానిపించాలని రేట్లు రెట్టింపు చేయడం, జనం లావవుకుండా నిత్యావసరాల ధరలు పెంచి తినకుండా చేయడం, వాయుకాలుష్యం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేయడం.. ఇలా తాను చేసిన ప్రతి దొంగపనికి సుద్దులు చెప్పే వాడే చంచల్ గూడ స్కూలు, స్టూడెంట్ నెంబర్ 6093, బ్యాచ్ నెంబర్ 420 జగ్గడు.' అంటూ రాసుకొచ్చారు. టీడీపీ నేత లోకేష్ సీఎం జగన్ పై చేసిన ట్వీట్ పై వైసీపీ ఫ్యాన్స్ కామెంట్స్ లో తిట్ల పురాణం మొదలు పెట్టారు. విద్యుత్ పొదుపు చేయాలంటే కరెంటు ఛార్జీలు పెంచేయడం... మద్యం నిషేధించకుండానే తాగుడు మానిపించాలని రేట్లు రెట్టింపు చేయడం... జనం లావవుకుండా నిత్యావసరాల ధరలు పెంచి తినకుండా చేయడం... వాయుకాలుష్యం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేయడం... ఇలా తాను చేసిన… — Lokesh Nara (@naralokesh) November 18, 2023 మరోవైపు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మద్యం దుకాణాలు రద్దు చేస్తామని.. ఫైవ్‌స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు తీసుకొచ్చి ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. ఫుడ్ డెలివరీ లాగా మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారని.. నాసిరకమైన మద్యాన్ని అమ్ముతున్నారు ఆరోపించారు. #ap-news #lokesh #cm-jagan #telugu-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి