Nara Lokesh: ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు.. నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్! ఏపీలో చంద్రబాబు పాలనలో ప్రతీకార రాజకీయాలకు తావు లేదని నారా లోకేష్ అన్నారు. న్యాయానికి కట్టుబడి పాలన సాగిస్తామని చెప్పారు. అలాగే చట్టాలను అతిక్రమించిన వారిని వదిలే ప్రసక్తే లేదని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. By srinivas 07 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Nara Lokesh: ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ నేత నారా లోకేష్ జాతీయ మీడియాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ప్రతీకార రాజకీయాలకు తావు లేదన్నారు. న్యాయానికి కట్టుబడి పాలన సాగిస్తామని, చట్టాలను అతిక్రమించిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టాల పరధి దాటి వ్యవహరించిన అధికారులను విచారిస్తాం. గత ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు జరిగాయి. సాండ్ మైనింగ్ (Sand Mining), లిక్కర్ మాఫియా, డ్రగ్స్ (Drugs) సరఫరాపై విచారణ జరిపిస్తాం. పారదర్శకంగా విచారణ జరిపి తదుపరి చట్టానికి వదలేస్తాం. ఎన్డీఏకు (NDA) బేషరతుగా మద్దతు తెలిపాం. మేము ఎలాంటి మంత్రి పదవులు డిమాండ్ చేయలేదు. ఎన్డీఏలోనే కొనసాగుతాం, మరో ఆలోచన లేదని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతిపైనే దృష్టి.. అలాగే తమ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, అణగారిన వర్గాల అభ్యున్నతిపైనే దృష్టి సారిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను తాము కొనసాగిస్తామని, తాము దాని కోసం నిలబడతామన్నారు. మైనారిటీలు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారనేది వాస్తవం. వారి తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది. వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడం నా బాధ్యత. నేను తీసుకునే ఏ నిర్ణయామైనా ప్రజల శ్రేయస్సు కోసమే అన్నారు. Also Read: విజయవాడలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటిపై దాడి.! ఇదొక గొప్ప అవకాశం.. ఇక బీజేపీతో (BJP) పొత్తుపై మాట్లాడుతూ.. అందరం కలిసి చేయాలి. దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఇదొక గొప్ప అవకాశం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త కేబినెట్‌లో స్పీకర్ పదవి, కొన్ని కీలక శాఖలను టీడీపీ కోరుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. పదవి కోసం టీడీపీ ఎప్పుడు చర్చలు జరపదు. రాష్ట్రానికి నిధుల కోసం మాత్రమే చర్చలు జరుపుతాం. మేము మంత్రిత్వ శాఖలను అడగలేదు. మా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు అని పేర్కొన్నారు. 'బలమైన రాష్ట్రాలు బలమైన దేశాలను తయారు చేస్తాయి. మేము 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలలో భాగం కావాలనుకుంటున్నాం. ఆంధ్ర మాత్రమే 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారగలదని మేము నమ్ముతున్నాం. ఎన్‌డిఎతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాం ' అని ఆయన అన్నారు. ఒకరకంగా ఇది ప్రతీకార రాజకీయమే.. ఇక తన తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. ఒక రకంగా ఇది ప్రతీకార రాజకీయమే. నా తండ్రిని అన్యాయంగా 52 రోజులు జైలులో పెట్టారు. కానీ మా ప్రభుత్వంలో ప్రతీకార రాజకీయాలకు తావులేదు. ప్రతి ఒక్కరికీ సమానంగా చట్టబద్ధత అమలు చేయాలని అన్నారు. #nara-lokesh #tdp #ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి