తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్ ‘హాయ్ నాన్న’: ట్రైలర్ రిలీజ్ నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్ కథాంశంగా చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. By Naren Kumar 24 Nov 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Hi Nanna: తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషన్స్ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం హాయ్ నాన్న. నేచురల్ స్టార్ నాని (Nani), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాతో డైరెక్టర్ గా శౌర్యువ్ పరిచయమవుతున్నారు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా 'హాయ్ నాన్న' చిత్రం ట్రైలర్ ను సినిమా బృందం విడుదల చేసింది. తల్లి లేని బిడ్డ జీవితం కథాంశంగా చిత్రాన్ని నిర్మించినట్లు అర్థమవుతోంది. ఆ బిడ్డ జీవితంలో లోటు ఎలాంటిది, దాన్ని తెలియకుండా నాన్న ఎలా పెంచాడు... అన్నది ప్రధాన కథాంశం. నాని ఎమోషనల్ సీన్స్ ను పండించాడు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలో విడుదలవబోతోంది. #nani #telugu-movies #hi-nanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి