Nagababau: నాగబాబుకు శిల్పా రవి స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ..! మా వాడు, పరాయి వాడంటూ జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ కు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ ట్వీట్ బన్నీ గురించే అయితే అది ఆయన సంస్కారం, విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. అది వాళ్లకే నష్టం. అల్లు అర్జున్‌కు పోయేదేమీలేదన్నారు. By srinivas 14 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Shilpa Ravi: జనసేన నాయకుడు నాగబాబుకు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై మంగళవారం RTVతో మాట్లాడిన శిల్పా రవి.. నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ గురించి కాదని అనుకుంటున్నా అన్నారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...! — Naga Babu Konidela (@NagaBabuOffl) May 13, 2024 ఈ మేరకు శిల్పా రవి మాట్లాడుతూ.. నాగబాబు ట్వీట్ ఒకవేళ అల్లు అర్జున్ గురించే అయితే అది ఆయన సంస్కారం, విజ్ఞతకే వదిలేస్తున్నా. అల్లు అర్జున్ సంస్కారం ఏంటో ప్రజలకు తెలుసు. ఫ్రెండ్‌కు విషెస్ చెప్పడం కోసం 600 కిలోమీటర్లు అల్లు అర్జున్ ప్రయాణం చేసి వచ్చాడు. ఇక్కడే అర్థం అవుతోంది అల్లు అర్జున్ గొప్పతనం ఏంటో. నా బంధువులకైనా, నా అనుకున్నవాళ్లకైనా సపోర్ట్ చేస్తా అని అల్లు అర్జున్ క్లియర్‌గా చెప్పాడు. అందరూ నావాళ్లే అని బన్నీ అనుకుంటున్నాడు. నావాళ్లు కాదని అవతలి వ్యక్తులు అనుకుంటే.. అది వాళ్లకే నష్టం. అల్లు అర్జున్‌కు పోయేదేమీ లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో శిల్పా రవి వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. #allu-arjun #nagababu #mla-shilparavi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి