AP : వైసీపీ VS టీడీపీ.. వరదల్లో రాజకీయ ఘర్షణ..!

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించడానికి వెళ్లారు. 4 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాని మీరు ఇప్పుడెందుకు వచ్చారని టీడీపీ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ జరిగింది.

New Update
AP : వైసీపీ VS టీడీపీ.. వరదల్లో రాజకీయ ఘర్షణ..!

NTR District : ఎన్టీఆర్‌ జిల్లా వరదల్లో (Floods) రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ, వైసీపీ (TDP - YCP) శ్రేణుల మధ్య వివాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించడానికి ఆయన వెళ్లారు. అయితే, అతడిని లోపలకు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

Also Read: పాఠశాలలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి..!

వరదలతో ప్రజలు 4 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రానీ మీరు ఇప్పుడెందుకు వచ్చారని మాజీ ఎమ్మెల్యేను టీడీపీ శ్రేణులు నిలదీశారు. దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఆర్డీవో ఇరువైపుల వారినీ సముదాయించే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు.

ఈ వివాదంతో మాజీ ఎమ్మెల్యే వెనుతిరిగి కారెక్కగా వారిని కార్యకర్తలు బయటకు లాగే ప్రయత్నం చేశారు. చివరికి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు (Jagan Mohan Rao) అక్కడి నుంచి అవమానంతో వెళ్లిపోయారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు. 

author-image
By Manogna alamuru
New Update
MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ దువ్వాడపై మొత్తానికి వేటు పడింది. గత కొన్ని రోజలుగా వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చర్యలు తీసుకున్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పినట్లు ఫిర్యాదులు రావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 

జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే..

పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే దువ్వాడను సస్పండ్ చేశారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జి పేరాడ తిలక్ కి మద్దతు తెలపమని జగన్ అడిగారు. కానీ దీనికి దువ్వాడ ఒప్పుకోలేదు. దీంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారని చెబుతున్నారు. నాయకుడు చెప్పిన వెంటనే సస్పెన్షన్ ను అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ.  దీంతో ఇప్పటి వరకు జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో అని పార్టీ జనాలు అనుకుంటున్నారు. ఇతని సస్పెన్షన్ తో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిణించాయని..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హాస్తం వుందని మాట్లాడుకుంటున్నారు. 

 

ap
Mlc Duvvada suspention

 

 

 today-latest-news-in-telugu | duvvada-srinivas | ycp | suspend

Also Read: J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు