Kalyana Ram: ఒక నిర్ణయం తీసుకున్నాక మీకు చెబుతాను

కల్యాణ్‌ రామ్‌ కనిపిస్తే చాలు అందరూ ఎన్టీఆర్‌ దేవర సినిమా గురించే అడుగుతున్నారు. ఎందుకంటే దేవర మూవీకి కల్యాణ్‌ రామ్‌ నే నిర్మాత. అందుకే అందరూ దేవర గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల గురించి కూడా కల్యాణ్‌ రామ్‌ ప్రస్తావించారు.

New Update
Kalyana Ram: ఒక నిర్ణయం తీసుకున్నాక మీకు చెబుతాను

Kalyan Ram: గత ఏడాది నుంచి కళ్యాణ్‌ రామ్‌ హిట్లు మీద హిట్లు కొడుతూ.. మంచి పేరు తెచ్చుకున్నాడు. కొత్త కొత్త కథనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన దైన శైలిలో అలరిస్తున్నాడు. ఏడాది అమిగోస్‌ (Amigos)అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయాన్ని చవి చూశాడు. ఇక ఏడాదిలో ఎలాగైనా మరో హిట్‌ కొట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు.

అందుకే ఈ ఏడాది చివరిలో అభిమానులను అలరించడానికి డెవిల్‌ (Devil) సినిమాతో వస్తున్నాడు. డెవిల్‌. ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ట్యాగ్‌ లైన్‌ గా ఉంది. దీనిని డిసెంబర్‌ 29 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. దీనికి అభిషేక్‌ నామా దర్శక నిర్మాతగా ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్‌ లో జోరు పెంచాడు కల్యాణ్‌ రామ్‌. వరుస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా సమయం గడుపుతున్నారు. అయితే కల్యాణ్‌ రామ్‌ సినిమా విశేషాలతో పాటు కొన్ని పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు.

తాజాగా కల్యాణ్‌ రామ్‌ కనిపిస్తే చాలు అందరూ ఎన్టీఆర్‌ దేవర సినిమా (Devara Movie) గురించే అడుగుతున్నారు. ఎందుకంటే దేవర మూవీకి కల్యాణ్‌ రామ్‌ నే నిర్మాత. అందుకే అందరూ దేవర గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల గురించి కూడా కల్యాణ్‌ రామ్‌ ప్రస్తావించారు.

ఈసారి చాలా పోటాపోటీగా ఉన్నాయి. మీరు, తారక్ ఏ సైడ్ ఉండబోతున్నారు.. ? లేకపోతే సైలెంట్ గా చూస్తూ ఉంటారా అన్న ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందించాడు. ” మేము ప్రస్తుతం ఏ దారిలో వెళ్తున్నా.. అది కుటుంబ విషయం. అది కుటుంబం ద్వారా వచ్చింది. అందుకే.. కుటుంబం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని.. తరువాత అందరికి చెప్తాం. కుటుంబం అంటే.. నేను, తారక్. మిగిలినవారు కూడా ఉన్నారు. నా స్టేట్మెంట్ గా ఇది నేను ఇవ్వను.. కుటుంబం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలి. ఇలా ఇస్తే వేరే విధంగా ఉంటుంది. సినిమా అనేది ఒక పర్స్పెక్టీవ్.. ఇది వేరు. మేము ఇద్దరం ఒక నిర్ణయం తీసుకొని అభిమానులకు చెప్తాం” అని చెప్పుకొచ్చాడు.

Also read: గుడ్ న్యూస్…జనవరిలో కొత్త రేషన్ కార్డులు…కానీ అంత ఈజీగా ఇవ్వరట..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు