వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వాయిదా వేసిన సీబీఐ కోర్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన విచారణణు నాంపల్లి సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసుపై సోమవారం మరోసారి విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ తో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టగా.. కోర్టు కాసేపు వాయిదా వేసింది. By E. Chinni 14 Aug 2023 in రాజకీయాలు Scrolling New Update షేర్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన విచారణణు నాంపల్లి సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసుపై సోమవారం మరోసారి విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ తో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టగా.. కోర్టు కాసేపు వాయిదా వేసింది. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉదయ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను పోలీసులు ఉదయం 11 గంటల సమయంలో కోర్టుకు తీసుకొచ్చారు. ఈ ఏడుగురిని కలిపి సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన దస్తగిరి మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీని ప్రకారం విచారణ చేపడుతోంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్ వేసింది. ఇందులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది. 145 పేజీలతో మూడో ఛార్జ్‌షీట్ కోర్టులో సీబీఐ వేయగా.. జూన్ 19 తేదీన సీబీఐ డైరెక్టర్‌కు అవినాష్ లేఖ రాశారు. దర్యాప్తును పునః సమీక్షించాలని లేఖలో కోరారు. గత దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై ఆరోపణలు చేసిన అవినాష్.. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని లేఖలో అవినాష్ రెడ్డి ఆరోపించారు. వాటిపై మరోసారి పునఃపరిశీలన చేయాలని సూచించారు. కానీ అవినాస్ లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వివేకా కేసులో ఇప్పటికే పలుమార్లు అవినాష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. #viveka-murder-case #murder-case #ys-vivekananda-reddy #investigation-updates #nampally-cbi-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి