Elections 2024: డిఫరెంట్‌గా నామినేషన్...రూపాయి నాణేలతో దాఖలు ఎన్నికల్లో పోటీ చేయడానికి వేసే నామినేషన్ దాఖలు ప్రక్రియకు రకరకాలుగా అభ్యర్ధులు వెళ్లడం మనకు తెలిసిందే. నడిచి, ర్యాలీగా, ఎద్దుల బండిలో వెళ్ళడం..ఇలా చాలా రకాలు చూశాము. కానీ 10 వేల నాణేలతో వెళ్ళి నామినేషన్ వేయడం గురించి ఎక్కడైనా విన్నారా...లేదా..అయితే ఇది చదివేయండి. By Manogna alamuru 03 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Maharashtra: ఎన్నికలు వచ్చాంటే చాలు...అభ్యర్ధుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. జనాలను అకర్షించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విన్నూత్న ప్రచారాలు, ఆర్భాటాలు...ఓహ్ ఒకటేమిటి..డబ్బులు ప్రవాహంలా ఖర్చు పెడుతూ వింత వింత పనులు అన్నీ చేస్తుంటారు. ఏది ఏమైనా ఓటర్లను తమవైపుకు తిప్పుకోవడమే వారి లక్ష్యం. ఇందులో ఇప్పుడు నామినేషన్ల దాకలు ప్రక్రియ కూడా చేరుతోంది. నామినేషన్ దాఖలు చేయడం దగ్గర నుంచే తమ ప్రత్యేకత చూపించడానికి పోటీ పడుతున్నారు అభ్యర్ధులు. ఇందులో భాగంగా రకరకాలుగా నామినేషన్లు వేయడానికి వెళుతున్నారు. మహారాష్ట్రలో ఓ అభ్యర్ధి కూడా ఇదే పని చేశారు. షురూ అయిన నామినేషన్ల ప్రక్రియ.. ఎన్నికల ప్రకటన వచ్చింది. మొదటి రెండు దశల పోలింగ్‌కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ షురూ కూడా అయిపోయింది. పలు చోట్ల అభ్యర్ధులు నామినేషన్లు కూడా దాకలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బుల్దానా స్థానంలో ఓ అభ్యర్ధి విన్నూత్నంగా తన నామినేషన్ దాకలు చేశారు. అందరిలా తానూ ఉంటే ఎలాగ అనుకున్నారో ఏమో కానీ...నామినేషన్ వేసేందుకు రూపాయి నాణేలతో వెళ్ళారు. 10 వేల రూపాయి నాణేలు.. మహారాష్ట్ర లోక్‌షాహి వికాస్ అఘా పార్టీ అభ్యర్ధి అస్లాం షా ప్రజల దగ్గర నుంచి 10 వేల రూపాయల నాణేలను సేకరించారు. అవి కూడా అన్నీ రూపాయి నాణాలే. దీటిని ఎన్నికల అధికారి కార్యాలయానికి తీసుకుని వెళ్ళి డిపాజిట్‌గా సమర్పించారు అస్లాం. అధికారులు కూడా వాటిని తిరస్కరించడకుండా...ఆ నాణేలను నిశితంగా లెక్కించారు. ఆ తతంగం పూర్తయిన తర్వాత...లెక్క సరిపోయాక నామినేషన్ పత్రాలను ఆమోదించారు. Also Read:Viral: మాకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవడం లేదు…బిడ్డను దత్తత తీసుకోండి #maharastra #election-2024 #nomination #one-rupee-coins మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి