Namibia President: నమీబియా దేశాధ్యక్షుడు గింగోబ్‌ కన్నుమూత!

నమీబియా దేశా అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్ ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆ దేశ అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించారు.

New Update
Namibia President: నమీబియా దేశాధ్యక్షుడు గింగోబ్‌ కన్నుమూత!

Namibia President: నమీబియా(Namibia) దేశా అధ్యక్షుడు హేజ్‌ గింగోబ్ (Hez Gingobe)  ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆ దేశ అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్‌ (Cancer) తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం ఉదయం కన్నుమూసినట్లు తెలిపారు. ఆయన గత నెలాఖరులో వైద్య పరీక్షల కోసం యూఎస్‌ కు వెళ్తున్నట్లు తెలిపారు.

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం రోజున నమీబియా అధ్యక్షుడు మరణించడం విషాదాకరం. గెంగోబ్‌ విండ్‌ హోక్‌ లోని లేడీ పోహంబా ఆసుప్రతిలో గింగోబ్‌ మరణించారు. 2014లోనే ఆయన ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఓ సారి ప్రొస్టేట్ క్యాన్సర్‌ నుంచి బయటపడినట్లు గింగోబ్‌ తన దేశ ప్రజలకు చెప్పారు.

గింగోబ్‌ ఆకస్మిక మరణం పట్ల రాజకీయ నాయకులతో పాటు సామాన్యులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే గింగోబ్‌ మరణించారు.

Also read: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ గుడ్‌ న్యూస్‌ మీకోసమే..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment