Tripura Governor: త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం ( అక్టోబర్ 26) ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. By Vijaya Nimma 26 Oct 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం ( అక్టోబర్ 26) ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ దంపతులు బుధవారం నాడు అగర్తలా చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, అతని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన నియామకంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోమ్ మంత్రికి నల్లు ఇంద్రసేనారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఉదయం గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాజభవన్‌లో ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, సీనియర్ అధికారులతో నల్లు ఇంద్రసేనారెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను, ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ వివరించారు. ఇది కూడా చదవండి: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్… కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు ఈ సందర్భంగా నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, సాధారణ పౌరులు సైతం సాధికారత సాధించేలా అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనేక మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు పూల దండలతో నల్లు ఇంద్రసేనారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, సహచర మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు, మీడియా సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ గవర్నర్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఇది కూడా చదవండి: టీడీపీపై మండిపడ్డ బొత్స, వైవీ సుబ్బారెడ్డి..బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్తామని వెల్లడి #governor #tripura #nallu-indrasena-reddy #takes-over మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి