Hyderabad:ఖైదీ కడుపులో మేకులు, టేపు, బ్లేడు చంచల్ గూడ జైల్లో ఓ ఖైదీకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మెలికలు తిరగిపోతుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఏమైందా అని చూస్తే అతని కడుపులో బ్లేడు, మేకులు, సెల్లో టేపు చుట్టలు లాంటి వస్తువులు కనిపించాయి. దీంతో పోలీసులు, డాక్టర్లు అవాక్కయ్యారు. By Manogna alamuru 10 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఓరినీ కడుపులో ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తున్నావు రా అంటున్నారు చంచల్ గూడ జైలు పోలీసులు. అక్కడ ఓ ఖైదీ కడుపులో ఉన్న వస్తువులను చూసి విస్తుపోతున్నారు. అసలేం జరిగిందంటే...జైల్లో ఎండీ.సొహైల్ కడుపు నొప్పి అంటూ కంప్లైంట్ చేశాడు. డాక్టర్లు వచ్చి చూసి మందులు ఇచ్చి వెళ్ళారు. అవి వాడినా కూడా ఏం ఫలితం కనిపించలేదు. దాంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు ఎక్స్‌రే తీశారు. అదిగో అప్పుడే వాళ్ళకు షాక్ తగిలింది. అది తీసుకొచ్చి పోలీసులకు చూపిస్తే వాళ్ళు కూడా అవాక్కయ్యారు. ఇంతకీ ఏమైంది అంటే...సొహైల్ కడుపులో మేకులు, బ్లేడు, సెల్లో టేపుల చుట్టలు కనిపించాయి. Also read:నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ సొహైల్ కడుపులో ఉన్న వస్తువులు ఏమీ అరిగేవి కావు. బయటకు కూడా రావు. దాంతో కొన్ని రోజులుగానే కడుపులోనే ఉండిపోయాయి. అరగని వస్తువులు పొట్టలో ఉంటే జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. దానివల్లనే కడుపునొప్పి కూడా వస్తుంది. ఖైదీ విషయంలో కూడా ఇదే జరిగింది. దీంతో డాక్టర్లు ఖైదీ సొహైల్ కి ఆపరేషన్ చేసి మేకులు, బ్లేడు, టేపు చుట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఖైదీ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే అతను అవన్నీ ఎందుకు మింగాడో మాత్రం ఎవరికీ తెలియలేదు. పోలీసులు ఎంత అడిగినా సొహైల్ కూడా చెప్పలేదు. పోనీ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు అనుకుందామనుకున్నా...పొట్టలోకి వస్తువులు వెళిపోతే..బయటకు ఎలా తీద్దామనుకున్నాడో అంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇదేం పనిరా నాయనా అంటూ అవాక్కవుతున్నారు. #hyderabad #chanchalguda-jail #prisoner #xray మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి