Naga Chaitanya: నేడు నాగచైతన్య నిశ్చితార్థం..అమ్మాయి ఎవరో తెలుసా..!

అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం. చైతూ సమంతతో విడాకులు తీసుకున్న తరువాత శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెద్దలను ఒప్పించి వారు ఈరోజు ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నారు.

New Update
Sobhita And Naga Chaitanya : మళ్లీ దొరికిపోయిన చైతు, శోభిత ధూళిపాళ.. హాలీడే ఎంజాయ్ చేస్తున్న పిక్ వైరల్

Naga Chaitanya Engagement: యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం ఈరోజు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జరగబోతున్నట్లు సమాచారం. చైతూ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య తన సినిమా హీరోయిన్‌ సమంతను 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

అయితే వీరిద్దరూ నాలుగేళ్ల తరువాత విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత విడాకులు తీసుకుని వేరు పడ్డారు. ఆ తరువాత నాగ చైతన్య. శోభితా ధూళిపాళ్ళ (Sobhita Dhulipala) ప్రేమలో ఉన్నారని అనేక వార్తలు బయటకు వచ్చాయి. నేడు వాటిని నిజం చేస్తూ ఆ జంట ఒక్కటి కాబోతుంది. ఇరు కుటుంబాలు అంగీకారం మేరకు, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకోబోతున్నారని సమాచారం.

ఈ కార్యక్రమానికి మీడియాని అనుమతించ లేదు. కార్యక్రమం అనంతరం ఈ నిశ్చితార్ధం విషయాన్ని అక్కినేని వాగార్జున అధికారకంగా ప్రకటించి నూతన జంట ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోనున్నారని మాత్రం అక్కినేని యూనిట్‌ నుంచి టాక్ వినిపిస్తుంది.

Also read: కుస్తీనే గెలిచింది..నేనే ఓడిపోయా..రెజ్లింగ్‌ కి గుడ్‌ బై ..వినేశ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment