Mynampally Hanumantha Rao: మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే తామే దండా వేసి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డి 100 ఎకరాల భూమిని కబ్జా చేసారని.. తన వద్ద అధరాలు ఉన్నాయన్నారు.

New Update
Mynampally Hanumantha Rao: మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Mynampally Hanumantha Rao: మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మల్లారెడ్డి 100 ఎకరాలు స్వాహా చేశారని ఆరోపించారు. కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే మల్లారెడ్డికి దండ వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తాం అని అన్నారు. అప్పులపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మైనంపల్లి కౌంటర్‌ ఇచ్చారు. అప్పులెంత..? దోచుకున్నది ఎంత..? అని ప్రశ్నించారు. సబ్జెక్ట్‌ లేకుండా మల్లారెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నడిచింది... ఇప్పుడు కుదరదని వార్నింగ్ ఇచ్చారు. కుంభకోణాలు బయటపెడితే ప్రజలే మల్లారెడ్డికి భజన చేస్తారని అన్నారు. తిరుమలగిరిలోని పురాతన ఆలయ భూములను మల్లారెడ్డి శిష్యుడు స్వాహా చేసే యత్నం చేశాడని ఆరోపించారు. మల్లారెడ్డి భూకుంభకోణాలన్నింటికీ తన దగ్గర సాక్ష్యాలున్నాయని అన్నారు.

ALSO READ: బీఆర్ఎస్‌కు మరో షాక్… బీజేపీలోకి మాజీ ఎంపీ!

కేసీఆర్ పైనే మల్లారెడ్డి ఆశలు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఆయన కొడుకు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి నందినగర్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. ఆక్రమణల్లో నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించారు. అలాగే మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారంపై కేసీఆర్ అరా తీసినట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నీకు ఏం కాదు కాకా.. కేటీఆర్ భరోసా..

మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు మల్లారెడ్డి. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కేటీఆర్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేత వల్ల అయోమయంలో ఉన్న మల్లారెడ్డికి కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. “నువ్వు గిట్ల అయితే ఎట్లా కాకా.. నువ్వు ఫైర్ బ్రాండ్.. నీకు ఏం కాదు.. బీఆర్ఎస్ పార్టీ నిన్ను కాపాడుకుంటుంది.. ఏం ఆలోచించకు మేము ఉన్నాము” అని కేటీఆర్ మల్లారెడ్డికి మోటివేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు