Lavanya: సంగీతం టీచర్‌ డ్రగ్స్ దందా.. వీఐపీలతోనే సంబంధాలు

టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో ప్రియురాలు డ్రగ్స్ తో నార్సింగిలో పట్టుబడటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమెను కృష్ణా జిల్లాకు చెందిన మన్నెపల్లి లావణ్యగా గుర్తించారు. ఉన్నత చదువులకోసం హైదరాబాద్ వచ్చి సంగీతం టీచర్ గా పనిచేస్తూనే జల్సాల కోసం ఈ గలీజ్ దందాలో దిగింది.

New Update
Lavanya: సంగీతం టీచర్‌ డ్రగ్స్ దందా.. వీఐపీలతోనే సంబంధాలు

Lavanya Drugs Case: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ ఇష్యూ కలకలం రేపింది. ఇప్పటికే మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ తదితర వాడకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా వరుస సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో (Tollywood Young Hero) ప్రియురాలు డ్రగ్స్ తో నార్సింగ్ (Narsingi) లో పట్టుబడటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా సంగీతం టీచర్‌గా పనిచేస్తున్న ఆ యువతి నుంచి మాదాపూర్‌ SOT పోలీసులు 4 గ్రాముల MDM స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కేసు విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయపడ్డాయి.

ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌..
ఈ మేరకు నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిసిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన మన్నెపల్లి లావణ్య (34) ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పారు. కొంతకాలంగా కోకాపేటలో నివాసముంటున్న ఆమె.. సంగీతం టీచర్‌గా (Music Teacher) పని చేస్తూ పలు షార్ట్ ఫిల్మ్ లోనూ నటించినట్లు తెలిపారు. ఇదే సమయంలో జల్సాలకు అలవాటుపడిన లావణ్య డ్రగ్స్‌ దందా మొదలు పెట్టినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Kumari Aunty: కుమారి ఆంటీకి పోలీసుల షాక్.. ఫుడ్ బిజినెస్ బంద్

ఉనీత్‌రెడ్డితో పరిచయం..
'మాకు అందిన సమాచారంతో నిఘా వేసి ఆదివారం సాయంత్రం శంకర్‌పల్లి-నార్సింగి రహదారిలో లావణ్యను అదుపులోకి తీసుకోగా.. 4 గ్రాముల MDM ఆమె దగ్గర దొరికింది. లావణ్యకు కొన్నిరోజుల క్రితం పరిచయమైన ఉనీత్‌రెడ్డి ఏను తన బ్యాగులో MDM వేశాడని చెప్పింది. ఉనీత్‌రెడ్డి గతంలో డ్రగ్స్‌ వినియోగిస్తూ మోకిల పోలీసులకు చిక్కాడు. అతడే విక్రేతగా మారి సరఫరా చేస్తున్నట్లు గుర్తించాం. ఉనీత్‌రెడ్డి, ఇందు అనే మహిళ పరారీలో ఉన్నారు. లావణ్యను రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించాం' అని నార్సింగి పోలీసులు తెలిపారు.

ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు..
అలాగే లావణ్య మొబైల్ లో పలువురు టాలీవుడ్ నటుల (Tollywood Heroes) ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. కొంతమంది సింగర్లు, సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు మోకిలా డ్రగ్స్ కేసులోనూ, వరలక్ష్మి టిఫిన్స్ (Varalaxmi Tiffins) డ్రగ్స్ కేసులోను లావణ్య నిందితురాలిగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం కోకాపేటలో ఓ విల్లాలో నివాసం ఉంటున్న లావణ్య వద్ద లభించిన డ్రగ్స్ తో పాటు మొబైల్ లోని కాంటాక్ట్స్ పై కూడా ఆరాతీస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆమె సోషల్ మీడియా అకౌంట్లలోని వ్యక్తిగత చాట్‌ హిస్టరీని కూడా పరిశీలిస్తున్నామని, చాలామంది వీఐపీలతోనూ (VIP) ఆమెకు పరిచయాలు ఉన్నట్లు పలు ఆధారాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు