నిలిచిన ఏపీ-తెలంగాణ రాకపోకలు!

రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ పలు ప్రాంతాలకు వర్షాల వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆరా్ జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు బ్రిడ్జి పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణలోని వైరా, ఆంధ్రలోని జగ్గయ్యపేటకు రాకపోకలు నిలిచిపోయాయి.

New Update

munneru bridge is blocked due to heavy rain water flowing

మున్నేరు ఉద్ధృతంగా ప్రవాహిస్తుండటంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి మున్నేరులో వరద నీరు భారీగా పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు భయం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే రానున్న మూడు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాక హెచ్చరికలు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇప్పటికే అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. పాఠశాలలకు సెలవులు పొడిగించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు ఇచ్చారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు