Kalki 2898 AD : ప్రభాస్ తల్లిగా మృణాల్ ఠాకూర్.. 'కల్కి' లో అసలు ట్విస్ట్ అదే!

'కల్కి2898 AD' లో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో భైరవ తల్లి పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించిందట. భైరవ చిన్నప్పటి సన్నివేశాల్లో మృణాళ్‌ పాత్ర కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది.

New Update
Kalki 2898 AD : ప్రభాస్ తల్లిగా మృణాల్ ఠాకూర్.. 'కల్కి' లో అసలు ట్విస్ట్ అదే!

Mrunal Thakur Role In Kalki 2898 AD : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'కల్కి' సినిమా గురించే డిస్కషన్ నడుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీ అప్డేట్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కల్కి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచేసాయి.

కాగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీలో చాలామంది స్టార్స్ యాక్ట్ చేసిన విషయం తెలిసందే. ప్రభాస్ కి (Prabhas) జోడిగా దీపికా పదుకొనె (Deepika Padukone), విలన్ గా కమల్ హాసన్, అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. సినిమాలో ప్రభాస్ తల్లిగా మృణాల్ ఠాకూర్ కనిపించనుందట.

Also Read : ప్రభాస్ బుజ్జిని నడిపిన ‘కాంతారా’ హీరో.. వైరల్ గా మారిన వీడియో!

అసలు ట్విస్ట్ అదే...

ఇప్పటివరకు కల్కి నుంచి రిలీజైన్ ట్రైలర్స్ ను బట్టి చూస్తే సినిమాలో ప్రభాస్ తల్లిగా దీపికా పదుకొనె కనిపించనుందని, ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడని అర్థమవుతుంది. ట్రైలర్స్ చూసిన ఆడియన్స్ కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. కానీ అది నిజం కాదని తాజా సమాచారం. కల్కి లో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమాలో భైరవ తల్లి పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించిందట. భైరవ చిన్నప్పటి సన్నివేశాల్లో మృణాళ్‌ పాత్ర కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ ఒకింత షాక్ కు గురౌతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది రెండు రోజుల్లో తెలిసిపోతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు