MP Venkat Reddy: బీఆర్‌ఎస్‌ నేతల దోపిడీ ఎక్కువైంది

బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు.

New Update
MP Venkat Reddy: బీఆర్‌ఎస్‌ నేతల దోపిడీ ఎక్కువైంది

బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అందిచే దళితబంధు, నిరుపేద బీసీలకు అందించే బీసీ బంధు పథకాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కోతలు విధిస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌ నియోజకవర్గంలో 556 దళిత కుటుంబాలకు గాను ప్రభుత్వం కేవలం 12 కుటుంబాలకే దళిత బంధు ఇచ్చారన్నారు. కానీ ఆ 12 కుటుంబాలకు చేరే దళిత బంధులో సైతం స్థానిక నేతలు కమీషన్ల రూపంలో బాధితుల నుంచి డబ్బులు తీసుకున్నారని మండిపడ్డారు.

అంతే కాకుండా బీఆర్‌ఎస్‌ నేతలు వారి సహచరులకు మాత్రమే దళిత బంధుకు లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. ఇలా అయితే దళితులు ఎలా అభివృద్ధి చెందుతారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలు దళిత బంధులో 30 శాతం వాటా తీసుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ పేదలకు కాకుండా బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీటీసీ, సర్పంచ్‌లకే దళిత బంధును అందించారని విమర్శించారు.

అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులనైనా వదిలిపెట్టనన్న కేసీఆర్‌.. ఆయన కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. దళిత బంధులో భాగంగా ఎమ్మెల్యేలు తీసుకుంటున్న కమీషన్లలో సీఎంకు కూడా వాటా ఉందని ఎంపీ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్న కోమటిరెడ్డి.. కేసీఆర్‌కు ఎలా బుద్ది చెప్పాలో అలానే చెప్పుతారని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు