MP Elections : టార్గెట్ '10'.. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ నాయకులతో చర్చించనున్నారు. By V.J Reddy 23 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Amit Shah To Visit Telangana : బీజేపీ(BJP) అధిష్టానం తెలంగాణపై మరోసారి నజర్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కేంద్ర బీజేపీ నేతలు తెలంగాణలో వరుస పర్యటనలు చేపట్టారు. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణలో వరుస సభలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. ఏదిఏమైనా తెలంగాణలో బీజేపీ నేతల పర్యటన కొంత ప్రభావం చూపిందనే చెప్పాలి. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోయినా.. 8 సీట్లతో మొన్న జరిగిన ఎన్నికల్లో సరిపెట్టుకుంది బీజేపీ. గత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక సీటుకే పరిమితం అయింది. మధ్యలో బై ఎలెక్షన్స్ లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులుగా విజయం సాధించారు. 2023 ఎన్నికల నాటికి బీజేపీ 3 స్థానాలకు ఎగబాకింది. ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు! కానీ, 2023 ఎన్నికలు బీజేపీ నేతలతో పాటు తెలంగాణ(Telangana) ప్రజలకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాయి. తెలంగాణ బీజేపీ ఫెసెస్ గా చెప్పబడే కరీంనగర్(Karimnagar) నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్, దుబాక నుంచి రఘనందన్ రావు, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ ఇలా సీనియర్ నాయకులే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఎవరి ఊహించని రీతిలో వీరు ఓడిపోయిన.. బీజేపీ మాత్రం ఈ సారి ఎన్నికల్లో 8 స్థానాలో విజయ శంఖారావం పూరించింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపు దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్ల ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని సిద్ధమైంది. ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన బీజేపీ టార్గెట్ పక్కా పది.. పార్లమెంట్ ఎన్నికల్లో పది స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 28న ఆయన తెలంగాణకు రానున్నారు. తెలంగాణలో నెలకొన్న తాజాగా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర నాయకులతో వారు చర్చించనున్నారు. #telugu-latest-news #amit-shah #telangana-bjp #amit-shah-telangana-tour #parliament-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి