Loksabha Elections 2004: కవితకు కేసీఆర్ షాక్.. జీవన్ కు ఎంపీ టికెట్.. ఆసక్తి రేపుతోన్న న్యూఇయర్ ఫ్లెక్సీలు!

ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చాలని భావిస్తున్న కేసీఆర్.. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ను ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ ప్రజలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ లాల్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణమయ్యాయి.

New Update
Loksabha Elections 2004: కవితకు కేసీఆర్ షాక్.. జీవన్ కు ఎంపీ టికెట్.. ఆసక్తి రేపుతోన్న న్యూఇయర్ ఫ్లెక్సీలు!

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections 2023) అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ (BRS Party).. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులను మార్చాలని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు సీట్లు కలిసి ఉన్న మహబూబాబాద్ ఎంపీ సీటుకు సంబంధించి ఈ సారి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని బీఆర్ఎస్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణా స్టేట్ ఇన్ కం ట్యాక్స్ కమిషనర్.. ఐఆర్ఎస్ అధికారి లావుడ్యా జీవన్ లాల్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టికెట్ కేటాయించాలని ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ అధిష్టానాన్ని జీవన్ లాల్ కోరినట్లు తెలుస్తోంది. జీవన్ లాల్ తండ్రి 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని వైరా అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: మెట్రో విస్తరణ, ఫార్మాసిటీపై మా ప్లాన్ ఇదే.. గెస్ట్ హౌస్ గా మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్: న్యూఇయర్ వేళ రేవంత్ చిట్ చాట్

అనంతరం నాటి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయినా.. అధినేత కేసీఆర్ మాటకు కట్టుబడి పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేశారు. అయితే.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీకి రాములు నాయక్ కుమారుడు జీవన్ లాల్ ఆసక్తి చూపుతున్నారు. న్యూఇయర్ ను పురస్కరించుకుని మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జీవన్ లాల్ ఫోటోతో ఉన్న శుభాకాంక్షల ఫ్లెక్సీలు ఇందుకు బలం చేకూరుస్తోంది.

ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీగా మాజీ మంత్రి రెడ్యానాయక్ కూతురు మాలోతు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల మార్పునకు బీఆర్ఎస్ ఆలోచన చేస్తుండడం, జీవన్ లాల్ హైకమాండ్ ను కలిసి టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ లు చేస్తుండడంతో మాలోత్ కవితకు మరోమారు ఎంపీ టికెట్ దక్కుతుందా? లేదా? అన్న అశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనవరి 11న మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ అధిష్టానం సమావేశం కానుంది. తొలి సమావేశంలోనే అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad MLC Elections: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ తరఫున బరిలో దిగిన గౌతమ్ రావుపై కేవలం 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

New Update
Hyderabad MLC Elections

Hyderabad MLC Elections

Hyderabad MLC Elections: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ తరఫున బరిలో దిగిన గౌతమ్ రావుపై కేవలం 38 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. మొత్తం పోలైన 88 ఓట్లలో ఎంఐఎంకు 63 ఓట్లు, బీజేపీకి 25 ఓట్లు లభించాయి. క్రాస్ ఓటింగ్ మీద భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి తీరని నిరాశే ఎదురైంది.

అరగంటలోనే ఫలితాలు

ఏప్రిల్ 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 112 ఓటర్లలో 88 ఓట్లు మాత్రమే పోల్​అయ్యాయి. లెక్కింపు మొదలైన అరగంటలోనే ఫలితాలు తేలిపోయాయి. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ వెనక్కి

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు తెలుపగా, బీఆర్ఎస్ మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉంది. ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీలో పాల్గొనకపోవడం గమనార్హం.

Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Also ReadPahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment