MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.

New Update
MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతీ ఒక్కరు వారానికి ఒకసారైనా వీధులను శుభ్రం చేసుకోవాలని ఎంపీ సూచించారు. మరోవైపు మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై ఎంపీ భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండారు సత్యనారాయణకు సిగ్గుందా అని ఎంపీ వ్యాఖ్యలు చేశారు. బండారుకు భార్య, కుమార్తె ఉన్నారన్న ఆయన వారిని అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉన్నది మహిళా అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాండారు సత్యనారాయణ లాంటి వ్యక్తిని అర్ద నగ్నంగా ఊరేగించినా తక్కువే అవుతుందన్నారు. పోలీసులు ఇలాంటి దుర్మార్గులపై నిర్భయ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని ఎంపీ మండిపడ్డారు.

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై ఎంపీ భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందగానే లోకేష్‌కు వణుకు పుట్టడం స్టార్ట్‌ అయిందన్నారు. లోకేష్‌ జైల్లో తండ్రిని, బయట తల్లి, భార్యను వదిలి వెళ్లి ఢిల్లీలో దాచుకున్నాడని ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నాడని ఎంపీ ప్రశ్నించారు. లోకేష్‌ ఏ కలుగులో దాకున్నా సీఐడీ తోక పట్టుకొని లాగుతుందని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరి దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలని భరత్‌ ప్రశ్నించారు. టీడీపీ నాయకుల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ భరత్‌ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan: పవన్ ఇలాకా పిఠాపురంలో దారుణం.. దళితుల గ్రామ బహిష్కరణ.. పరిహారం అడగడమే పాపమా?

పవన్ ఇలాకా పిఠాపురం మల్లంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పనిచేస్తూ కరెంట్ షాక్‌తో పల్లపు సురేష్ చనిపోయాడు. దీంతో న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగిన దళితులను అగ్రవర్ణ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. టిఫిన్, కిరాణ షాపు సరుకులు కూడా ఇవ్వట్లేదు.

New Update

Pawa Kalyan: ఏపీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అగ్ర వర్ణాలు దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం కలకలం రేపుతోంది. వస్తువులను విక్రయించరాదంటూ హుకుం జారీ చేయడంతో దుకాణదారులు అమ్మకాలు నిలిపివేశారు. ఓ ఇంటి దగ్గర విద్యుత్ పని చేస్తూ షాక్ తగిలి పల్లపు సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, దళితులు బాధితుడి కుటంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. దీంతో గ్రామం నుంచి బహిష్కరించారని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

రంగంలోకి దిగిన ఆర్డీవో..

ఈనెల 16న అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి కరెంటు పనిచేస్తూ షాక్ తో పల్లపు సురేష్ చనిపోయాడు. సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. నష్టపరిహారంగా సుమారు రూ. 2 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తాము చేయని తప్పుకి నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు వాదనకు దిగారు. దీంతో దళితులను దూరం పెట్టాలని నిర్ణయించగా.. వస్తువులను విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు తీర్మానించాయి. ఆదేశాలు పాటించని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇష్యూ మరింత ముదరడంతో పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. స్వయంగా ఆర్డీవో రంగంలోకి దిగి దళితులు, అగ్రవర్ణాల వాదనలు విన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

pitapuram | dalith | village | issue | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment