OTT : ఈ వారం థియేటర్.. ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే! ఈ వారం థియేటర్, ఓటీటీ వేదికగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళ, కొరియన్, హాలీవుడ్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. కామెడీ, హారర్ సినిమాలతోపాటు పలు వెబ్ సిరీస్ లు సైతం సందడి చేయనున్నాయి. లిస్ట్ కోసం అర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 15 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి THEATRE - OTT : థియేటర్, ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాలు, పలు వెబ్ సిరీస్(Web Series) లు విడుదలకు రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా ఓటీటీ వేదికగా రాబోతున్న హాలీవుడ్ కామెడీ, హారర్ మూవీస్ ఈ వారం సినీ ప్రియులకు వినోదాన్ని పంచనున్నాయి. తెలుగులో పెద్ద హీరోల సినిమాలు లేకున్నా ఆసక్తికర స్టోరీతో కొత్త నటీనటుల చిత్రాలు అలరించనున్నాయి. థియేటర్: - చైతన్య రావు దర్శకత్వంలో సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పారిజాత పర్వం'(Paarijatha Parvam) కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' ఉపశీర్షిక తో వస్తున్న తెలుగు సినిమా ఏప్రిల్ 19న థియేటర్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. - నవీన్‌కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తెలుగు చిత్రం ‘శరపంజరం’(Sarapanjaram) ఏప్రిల్ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల వెతల నేపథ్యంలో తీసిన చిత్రమిది.- మాలాశ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రూపొందిన కన్నడ చిత్రం తెలుగులో ‘మారణాయుధం’ పేరుతో ఏప్రిల్ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. - శ్రేయాస్ తల్పాడే, తనీషా ముఖర్జీ జంటగా రాజీవ్ ఎస్. రియా తాజా తెలుగు సినిమా ‘లవ్ యూ శంకర్’(Love You Shankar) ఏప్రిల్ 19న థియేటర్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆహా: మై డియర్ దొంగ (తెలుగు) ఏప్రిల్ 19 నెట్‌ఫ్లిక్స్: ఎనీవన్ బట్ యూ (హాలీవుడ్) ఏప్రిల్ 15 రెబల్ మూన్ 2 (హాలీవుడ్) ఏప్రిల్ 19 డిస్నీ+ హాట్‌స్టార్: చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్) ఏప్రిల్ 19 సైరన్ (తెలుగు) ఏప్రిల్ 19 ఇది కూడా చదవండి: Samantha : ఆమె నాకు ఆదర్శం.. ఇంటర్ విద్యార్థినిపై సమంత ప్రశంసలు! జియో సినిమా: పొన్ ఒండ్రు కేంద్రేన్ (తమిళ) ఏప్రిల్ 14 ది సింపథైజర్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 14 బుక్ మై షో: డ్యూన్ (హాలీవుడ్) ఏప్రిల్ 19 లయన్స్ గేట్ ప్లే: డ్రీమ్ సినారియో (హాలీవుడ్) ఏప్రిల్ 19 ద టూరిస్ట్ (వెబ్‌సిరీస్2) ఏప్రిల్ 19 #cinema #web-series #theatre-ott మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి