Ashwin : మూడో టెస్ట్ నుంచి వైదొలగిన అశ్విన్.. కారణం ఇదే.. ఇంగ్లాడ్ - భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కీలక బౌలర్ అశ్విన్ మ్యాచ్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సమయంలో అతడికి అండగా ఉంటామని తెలిపింది. By B Aravind 17 Feb 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Team India : ఇంగ్లాడ్ - భారత్(England-India) జట్ల మధ్య మూడో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు(Team India) ఒక్కసారిగా భారీ షాక్ తగిలింది. కీలక బౌలరైన రవిచంద్రన్ అశ్వి్న్(Ravichandran Ashwin) ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి వైదొలగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్(X) లో వెల్లడించింది. అతని తల్లి అనారోగ్యానికి గురవ్వడంతోనే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా ఉంటుందని హామీ ఇచ్చింది. Wishing speedy recovery of mother of @ashwinravi99 . He has to rush and leave Rajkot test to Chennai to be with his mother . @BCCI — Rajeev Shukla (@ShuklaRajiv) February 16, 2024 R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency. In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR — BCCI (@BCCI) February 16, 2024 Also Read : చేతికి నల్ల రిబ్బన్లు ధరించి గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియా.. ఎందుకంటే? చెన్నైకి వెళ్లిన అశ్విన్ బీసీసీఐ(BCCI).. ఆటగాళ్లు , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యమిస్తుందని తెలిపింది. ఈ సమయంలో అశ్విన్, అతని కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని అభ్యర్థించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajiv Shukla) ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అశ్విన్ రాజ్ కోట్ నుంచి చెన్నై వెళ్లినట్లు తెలిపారు. అతని తల్లి తొందరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలాఉండగా.. మూడో టెస్టులో బ్యాటింగ్‌లో కేవలం 37 పరుగులు.. అలాగే బౌలింగ్‌లో ఒక వికెట్ తీశాడు అశ్విన్. ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్.. మ్యాచ్‌కు దూరమవ్వడం ప్రతికూలాంశమే. రెండో స్థానంలో నిలిచిన అశ్విన్ ఇక నిన్న రెండో రోజు ఆటలో జాక్ క్రావ్‌లీ వికెట్ పడగొట్టడం ద్వారా అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 500వ వికెట్ మైలురాయిను అందుకున్నాడు. ఈ ఫీట్ ద్వారా అశ్విన్ రెండు ఘనతలను తన అకౌంట్లో వేసుకున్నాడు. తక్కువ బాల్స్ వేసి 500 వికెట్లు తీసిన వారిలో అశ్విన్ రెండో స్థానంలో నిలవగా.. తక్కువ మ్యాచ్‌లలో 500 వికెట్లు తీసిన బౌలర్లలో కూడా అశ్విన్ రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. అయితే రాజ్‌కోట్ టెస్టులో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ 3 రోజుల పాటు అశ్విన్ అందుబాటులో ఉండడు. Also Read: 500 వికెట్ల క్లబ్‌లో ఆర్. అశ్విన్ #bcci #cricket-news #ravichandran-ashwin #india-vs-england-test-match మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి