Health Tips: తెల్ల జుట్టు వల్ల ఆరోగ్యానికి ముప్పు

తెల్లజుట్టు అనేది గుండె సంబంధిత సమస్యలకు సంకేతమని ఈజీపట్‌లోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓ అధ్యయనంలో బయటపడింది. తెల్లజుట్టు ఉన్నవారిలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు కనుగొన్నారు.

New Update
Health Tips: తెల్ల జుట్టు వల్ల ఆరోగ్యానికి ముప్పు

చాలామందికి జుట్టు తెల్లబడటం అనేది ఇప్పుడు సాధారణం అయిపోయింది. 25 ఏళ్లు నిండకుండానే జుట్టు రంగు మారిపోతుంది. చాలామంది ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేయకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జుట్టు నెరవడం అనేది గుండె సంబంధిత సమస్యలకు సంకేతమని చెబుతున్నారు. ఈజీపట్‌లోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓ అధ్యయనంలో ఇది బయటపడింది. ఈ అధ్యయనం కోసం 545 మందిని ఎంపిక చేశారు. వాళ్ల ఆరోగ్యం, జుట్టు రంగును పరిశీలించారు. అందరూ ఒకే రకమైన ఆహారం తీసుకోవాలని చెప్పారు.

Also Read: ప్రస్తుత కాలంలో మహిళలు వేగంగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు..ఈ లక్షణాలుంటే జాగ్రత్త!

పది సంవత్సరాల పాటు వీళ్లను గమనించగా.. తెల్లజుట్టు ఉన్నవారిలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇక జుట్టు నల్లగా ఉన్నవారిలో ఇలాంటి సమస్యలు చాలా తక్కువగా కనిపించాయి. తెల్లజుట్టు ఉన్నవాళ్లకు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి వాళ్లు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకొని జాగ్రత్తపడాలని సూచనలు చేస్తున్నారు.

Also Read: కొబ్బరి నీరు ఈ కాలంలో అమృతమే..కానీ వీరికి మాత్రం విషం తస్మాత్‌ జాగ్రత్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు