Monty Panesar: కోహ్లీ ఉంటే ఇంగ్లాండ్ కు ఆ భయముండేది.. మాజీ స్పిన్నర్ తొలి టెస్టులో భారత ఓటమి, ఇంగ్లాండ్ గెలుపుపై మాజీ స్పిన్నర్ మాంటీ పనేషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఇంగ్లాండ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. మాకు ప్రపంచకప్ గెలిచినట్లు అనిపిస్తోంది. కోహ్లీ ఉంటే మా జట్టుపై తనదైన శైలిలో ఒత్తిడి పెంచేవాడు'అన్నారు. By srinivas 30 Jan 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి IND vs ENG: భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్ట్ లో ఇండియా ఓటమి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఇంగ్లాండ్ అనూహ్యంగా గెలుపొందిందని చెప్పారు. వరల్డ్ కప్ గెలిచినట్లుంది.. ‘నిజంగా ఇది చాలా పెద్ద విజయం. ఇంగ్లాండ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. విదేశాల్లో ఇంగ్లాండ్ సాధించిన కీలక విజయాల్లో ఇదొకటి. మా దేశంలో ఇది పెద్ద వార్త. మాకు ప్రపంచకప్ గెలిచినట్లు అనిపిస్తోంది. ఇప్పుడున్న ఇంగ్లాండ్ టీమ్ తీరు పూర్తిగా భిన్నమైనది. టీమ్ ఇండియాను చూసి నేర్చుకుని వారినే ఓడించింది. 190 పరుగుల వెనుకబడ్డ ఇంగ్లాండ్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఓలీ పోప్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. మేం చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి' అన్నాడు. What a last day we are in for. #ENGvAUS #cricket #testcricket #Ashes2023 pic.twitter.com/lfoO5Rz98u — MontyChannel (@MontyChannel) June 20, 2023 కోహ్లీ ఉంటే.. అలాగే భారత ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ.. రోహిత్ శర్మ నిరాశాజనకంగా కనిపించాడని, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భారత్ స్వేచ్ఛ ఇవ్వడం మానేయాలని సూచించాడు. ఇక విరాట్ కోహ్లీ ఉంటే పర్యాటక జట్టు ఆటగాళ్లపై తనదైన శైలిలో స్పందించేవాడని, తన దూకుడుతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేవాడని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన సిరీస్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఓటమి భయంతోనే ఆడుతుందని తెలిపారు. వైజాగ్‌లో జరిగే రెండో టెస్టులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమైన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ లేకపోవడంతో రోహిత్ శర్మ ప్లాన్ మారుతుందని, మిగతా ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని చెబుతాడన్నాడు. ఇప్పుడు రోహిత్ తన నిజమైన కెప్టెన్సీని చూపిస్తాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. #kohli #rohith #ind-vs-eng #monty-panesar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి