Telangana : తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌!

తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Rain Alert : తెలంగాణ (Telangana) లో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది.

అలాగే, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, ములుగు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.

ఈ మేరకు పలు జిల్లాలకు ఐఎండీ (IMD) ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert) ను జారీ చేసింది. ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.

Also read: నేడు బక్రీద్‌..హైదరాబాద్‌ లో ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు