Mansoon : జూన్ మొదటి వారంలోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు!

జూన్‌ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. మే నెలాఖారుకే కేరళను రుతుపవనాలు తాకనున్నట్లు అధికారులు వివరించారు. కేరళ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది.

New Update
Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!

Mansoon Will Be Enter In Telangana : జూన్‌ మొదటి వారంలో తెలంగాణ (Telangana) లోకి నైరుతి రుతుపవనాలు (Mansoon) ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. మే నెలాఖారుకే కేరళను రుతుపవనాలు తాకనున్నట్లు అధికారులు వివరించారు. కేరళ (Kerala) నుంచి ఏపీ (AP) లోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుంది. అంటే 5-8 తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తుంది.

అది కానీ ఆలస్యమైతే జూన్‌ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ నిపుణులు సూచిస్తున్నారు. గతేడాది కేరళకే జూన్‌ 11న వచ్చాయి. తెలంగాణలో విస్తరించే సమయం 20వ తేదీ దాటిన విషయం తెలిసిందే. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్‌ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయన్న అంచనాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు.

Also read: జూన్‌ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ రూల్స్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun- Atlee: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ నెలకొంది. బన్నీ డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండనున్నారని టాక్‌ ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

New Update
Allu Arjun – Atlee

Allu Arjun – Atlee Movie

Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment