Money Laundering Case : కేజ్రీవాల్ కు మరో బిగ్ షాక్ ఇచ్చిన ఈడీ! ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని కూడా దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాట్‌లను కనుగొన్నట్లు ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. By srinivas 17 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Big Shock To Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi Excise Policy Case) లో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ (ED) మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను కూడా నిందితుడిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, హవాలా ఆపరేటర్ల మధ్య చాట్‌లను కనుగొన్నట్లు ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ తన డివైజ్‌ల పాస్‌వర్డ్‌ను షేర్ చేయడానికి నిరాకరించడంతో హవాలా ఆపరేటర్ల డివైజ్‌ల నుంచి చాట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ మేరకు ఇటీవలే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో దాఖలు చేయనున్న తదుపరి ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పేరు దోషిగా చేర్చబోతున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిల్ కోరుతూ ఆప్ నేత మనీష్ సిసోడియా పిటిషన్‌ను కోర్టు పరిశీలిస్తున్న సమయంలో కేంద్ర ఏజెన్సీ ఈ విషయం తెలిపింది. సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఆప్‌ని దోషిగా చేర్చుతారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ED దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై వాదనలను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ 8 వేల పేజీలతో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేపడతామన్న జడ్జి తెలిపారు. Also Read : తెలంగాణ కేబినెట్ మీట్ పై ఎన్నికల కోడ్ నీలినీడలు #ed #aap #kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి