Telangana: నెరవేరిన గిరిజనుల పదేళ్ల కల..ఎట్టకేలకు మోక్షం

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పోరాట ఫలితంగా గిరిజనుల కల సాకారమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ములుగులో ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పా టుచేయాల్సి ఉన్నా.. పదేళ్లుగా మోదీ ప్రభుత్వం కాలయాపన చేసింది. అసెంబ్లీ ఎన్నికల వస్తున్న సందర్భంగా.. తప్పని పరిస్థితుల్లో ట్రైబల్‌ వర్సిటీపై ప్రకటన చేయాల్సి వచ్చింది.

New Update
Telangana: నెరవేరిన గిరిజనుల పదేళ్ల కల..ఎట్టకేలకు మోక్షం

తెలంగాణ రాష్ట్ర విభజన హామీల్లో ఒక్కటైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు జిల్లాలో ఏర్పాటు చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోరాటాలు చేసింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఎన్నోమార్లు విన్నవించారు. అయినా బీజేపీ ప్రభుత్వం పట్టనట్టు చేసింది. తీరా అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన సంబంధంగా తెలంగాణపై ఎక్కడలేని ప్రేమను చూపిస్తోది మోదీ ప్రభుత్వం. మొదటీ నుంచి తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కిన మోదీ.. ప్రజల ఓట్ల కోసం.. సీట్ల కోసం.. ఎట్టకేలకు ట్రైబల్‌ యూనివర్సిటీపై ప్రకటన విడుదల చేశారు. వర్సిటీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగులో ఐదేళ్ల క్రితం స్థలం కేటాయించింది. దీనికి సంబంధించి కేంద్రానికి అప్పగించినా..పెద్దగా పట్టించుకోలేదు.. ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, విద్యార్థి విద్యార్థులు సమయం వచ్చినప్పుడల్లా నిరసనలు, నిరాహార దీక్ష చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ పోరాట ఫలితంగా నేడు గిరిజనులకు ఉన్నత విద్య సాకారం అయింది.

ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కోసం 48 గంటలు విద్యార్థి విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు నిరాహార దీక్షకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతంలో గిరిజన యూనివర్సిటీ కోసం, మేడారం జాతీయ హోదా ప్రకటించాలని కేసీఆర్‌ ప్రభుత్వం పోరాట, గిరిజనుల కల.. ఫలితంగా సాకారమైంది. విభజన చట్టంలో ములుగులో ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. పదేళ్లుగా మోదీ ప్రభుత్వం కాలయాపన చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. తెలంగాణ చట్టసభలో ఆమోదం పొందిన కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం, ఉక్కు కర్మగారం వాటికోసం ఆనాడే పోరాటం చేశామని తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కోసం డీపీఆర్‌లు కావాలంటే సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అయిదుగురితో కూడిన కమిటీని 2019లో ఏర్పాటు చేశారు.

విద్యార్థులు, రాజకీయ నాయకులు సంతోషంగా

ఆ రోజుల్లోనే యూనివర్సిటీ కోసం 336 ఎకరాల సేకరణలో ఉన్న భూమి అప్పగించడం జరిగిందన్నారు. గిరిజన యూనివర్సిటీకి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా దానికి ఇప్పుడు మోక్ష లభించదన్నారు. ఆ ఉద్యమాల ఫలితమే నేడు గిరిజన యూనివర్సిటీ ఏర్పడిందని ఈ సందర్భంగా విద్యార్థులు, రాజకీయ నాయకులు సంతోషంగా తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై అనేక ప్రేమ చూపిస్తూ.. సీఎం గిరిజనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాజకీయ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు కేంద్రాని, ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి:  హనుమకొండలో వెంటాడిన మృత్యువు.. పాపం కుటుంబం

Advertisment
Advertisment
తాజా కథనాలు