Mohan Babu : రజినీకాంత్ తో మోహన్ బాబు ఫొటో.. అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చిన కలెక్షన్ కింగ్, వైరల్ అవుతున్న పిక్!

రజినీకాంత్, మోహన్ బాబు తాజాగా విమానంలో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను మోహన్ బాబు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..'అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా స్నేహమేరా జీవితం..’అనే క్యాప్షన్‌ పెట్టారు. ఈ ఫొటో చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

New Update
Mohan Babu : రజినీకాంత్ తో మోహన్ బాబు ఫొటో.. అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చిన కలెక్షన్ కింగ్, వైరల్ అవుతున్న పిక్!

Rajinikanth, Mohan Babu In One Frame : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి మిత్రులనే విషయం తెలిసిందే. రజినీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మోహన్ బాబును కలుస్తుంటారు. మన కలెక్షన్ కింగ్ సైతం చెన్నై వెళ్లిన ప్రతిసారీ సూపర్ స్టార్ ను మీట్ అవుతారు. ఇక తాజాగా ఈ ఇద్దరూ విమానంలో కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను మోహన్ బాబు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫొటోకు ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.

Also Read : టికెట్ రేట్లపై ఆ అపోహలు వద్దు.. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు : నిర్మాత అశ్వినీదత్

స్నేహమేరా జీవితం...

రజనీకాంత్‌ షూటింగ్ కోసం హైదరాబాద్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు తాజాగా చెన్నైలో జరిగిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రిసెప్షన్‌కు హాజరై హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో వీళ్లిద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించారు. రజనీతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను మోహన్‌బాబు పంచుకుంటూ.. ‘అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా స్నేహమేరా జీవితం..’ అనే క్యాప్షన్‌ పెట్టారు. ఈ ఫొటో చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కొందరైతే ‘కన్నప్ప’లో రజనీకాంత్‌ ఉన్నారా? అని అడుగుతున్నారు. ప్రస్తుతం మోహన్‌బాబు 'కన్నప్ప' సినిమా పనుల్లో బిజీగా ఉండగా.. రజనీకాంత్ 'వేట్టయాన్‌' సినిమాలో నటిస్తున్నారు. ఇక ఆయన తన కొత్త సినిమా 'కూలీ' షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు